UP: “సారీ నాన్న”.. కొరియన్ గేమ్‌కు బలైన ముగ్గురు కూతుళ్లు.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: “సారీ నాన్న” ఇదేదో మామూలుగా చెప్పిన సారీ కాదు.. ముగ్గురు బిడ్డలు తమ ప్రాణాలను తామే బలవంతంగా తీసుకుని తండ్రికి చెప్పిన చివరి సారీ ఇది. ముగ్గురు కుమార్తెను సూసైడ్ చేసుకునే ముందు రాసిన లెటర్‌లోని వ్యాఖ్య ఇది. నిర్జీవంగా పడి ఉన్న ముగ్గురు కూతుళ్లను, వాళ్లు చివరి సారీగా రాసిన లెటర్‌ను చదివిన ఆ తండ్రి ఎంత ఆవేదనకు గురయ్యారో మీ ఊహకే వదిలేస్తున్నా.. అసలు ఏం జరిగిందంటే..
READ MORE: Ricky Ponting: వరల్డ్‌కప్‌లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
Also Read
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ళు అపార్ట్‌మెంట్ తొమ్మిదో అంతస్తు నుంచి దూకిన ప్రాణాలు వదిలారు. మృతుల వయస్సులు 12, 14, 16 సంవత్సరాలు. స్థానికులు భారీ శబ్దం విని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని సీల్ చేసి, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే సమయానికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటనకు కారణ ఒక కొరియన్ టాస్క్-బేస్డ్ ఆన్‌లైన్ గేమ్. ఆ గేమ్‌కు ఈ ముగ్గరు అమ్మాయిలు బానిసలయ్యారని పోలీసులు భావిస్తున్నారు. బాలికల తండ్రి చెతన్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ గేమ్‌లో మొత్తం 50 టాస్కులు ఉండగా సోమవారం చివరి టాస్క్ పూర్తయిందట. ఈ టాస్క్ పూర్తవ్వగానే ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డట్టు చెబుతున్నారు. “మా పిల్లలు ఇలాంటి టాస్క్ గేమ్ ఆడుతున్నారని నాకు అస్సలు తెలియదు. లూడో లాంటి గేమ్ ఆడుతున్నారు అనుకున్నాను. చనిపోవాలని చెప్పే గేమ్ ఉంటుందని ఊహించలేదు. ఫోరెన్సిక్ నిపుణులే ఈ విషయం చెప్పారు. వారు ఉపయోగించిన మొబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు,” అని కన్నీళ్లతో బాలికల తండ్రి చెతన్ కుమార్ వెల్లడించారు.
READ MORE: Ricky Ponting: వరల్డ్‌కప్‌లో భారత్ ఆశలు అతడిపైనే.. అభిషేక్పై రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు
అయితే.. ఈ ముగ్గురిలోని ఓ బాలికల గదిలో ఒక పేజీ సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో “ఇది నిజ జీవిత కథ. ఈ డైరీలో ఉన్నది అంతా చదవండి.. ఎందుకంటే ఇవన్నీ నిజమే. రీడ్ నౌ! ఐ యామ్ రియల్లీ సారీ.. సారీ నాన్న” అని రాసి ఉంది. ఆ నోట్‌లో కన్నీటి ఎమోజీ కూడా డ్రాయింగ్ చేశారు. పోలీసులు ఆ నోట్‌ను ఆధారంగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే గదిలో కుటుంబ సభ్యుల ఫొటోలు నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనకు ఆన్‌లైన్ గేమింగ్ కారణమా అనే విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. “ముగ్గురు బాలికలు తొమ్మిదో అంతస్తు బాల్కనీ నుంచి దూకారని సమాచారం అందింది. వెంటనే మేము అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అసలు కారణం ఏమిటో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది,” అని ఎస్పీ అతుల్ కుమార్ సింగ్ తెలిపారు. డీసీపీ నిమిష్ పాటిల్ మాట్లాడుతూ.. బాలికలపై కొరియన్ గేమ్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆ గేమ్‌లో 14 ఏళ్ల బాలిక లీడర్‌గా ఉండి ఆదేశాలు నిర్ణయించిందని అనుమానం. గేమ్‌లో భాగంగా బాల్కనీ నుంచి దూకేందుకు రెండు మెట్ల చిన్న లాడర్ వాడినట్టు అనుమానిస్తున్నారు. ఈ గేమ్‌ను ఎవరు పరిచయం చేశారు? ఎలా మొదలైంది? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ఆన్‌లైన్ గేమింగ్, పిల్లల మానసిక ఆరోగ్యం, తల్లిదండ్రుల అప్రమత్తతపై తీవ్రమైన చర్చకు దారి తీసింది. పిల్లల డిజిటల్ ప్రపంచాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, వారి ప్రవర్తనలో చిన్న మార్పులకైనా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!