Ranveer vs Ranbir: ధురంధర్ హిట్‌ను జీర్ణించుకోలేకపోతున్నారా?.. రణవీర్ యాక్టింగ్‌పై నెట్టింట రచ్చ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer Singh vs Ranbir Kapoor: ప్రస్తుతం బాలీవుడ్‌లో ధురంధర్ పేరు బాగా వినిపిస్తోంది. తాజాగా విడుదలైన ధరంధర్-2 టీజర్‌పై ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు.. బాలీవుడ్‌లో సినిమా విడుదల అనగానే తెర వెనుక జరిగే ఆటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల రిలీజ్ టైమ్‌లో పేడ్ పీఆర్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. బోర్డర్ 2, ధురంధర్ లాంటి సినిమాల సమయంలో సోషల్ మీడియాలో జరిగిన పరిణామాల గురించి కొత్తగా చెప్పనవసరం లేదని సినీ ప్రముఖులు చెబుతున్నారు. తాజాగా ధురంధర్ 2 టీజర్ రిలీజ్‌కు ముందు సైతం అదే సీన్ రిపీట్ అయిందని అభిప్రాయపడుతున్నారు. ఈసారి రణవీర్ సింగ్ వర్సెస్ రణబీర్ కపూర్ మధ్య ఫైట్ జరుగుతోందట.
READ MORE: Mahesh Babu: ఇండియాలో నా ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ మహేష్ బాబు కామెంట్స్!
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
సోమవారం ధురంధర్ 2 టీజర్ ఫిబ్రవరి 3న విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. అప్పటికే ఫ్యాన్స్‌లో హైప్ ఆకాశాన్ని తాకింది. ధురంధర్ ఇప్పటికే ఈ ఏడాది అతిపెద్ద సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 60 రోజులు దాటినా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా సినిమా, నటీనటుల గురించి చర్చ తగ్గలేదు. ఫ్యాన్స్ రణవీర్ నటనపై ప్రశంసలు కురిపించారరు. కానీ అదే సమయంలో కొందరికి ఈ క్రేజ్ నచ్చలేదట. అంతే.. సోషల్ మీడియాలో రణవీర్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు మొదలయ్యాయి. అతడిని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. రణవీర్‌ను రణబీర్ కపూర్‌తో పోల్చుతూ రణబీర్ గొప్ప నటుడు అన్నట్లు క్యాంపెయిన్ నడిచిందట. ఒకవైపు ధురంధర్‌లో రణవీర్ నటన, మరోవైపు ఎనిమల్ సినిమాలో రణబీర్ డైలాగ్ డెలివరీ చూపిస్తూ పోస్టులు ప్రత్యేక్షమవుతున్నాయి. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది.
READ MORE: YS Jagan Guntur Visit: నేడు గుంటూరు వైఎస్ జగన్.. మాజీ మంత్రి అంబటి కుటుంబానికి పరామర్శ..
ఎనిమల్ సినిమాలో రణబీర్–అనిల్ కపూర్ మధ్య ఉన్న భావోద్వేగ సీన్‌ను షేర్ చేస్తూ.. “నటన రణబీర్ రక్తంలోనే ఉంది” అని కొందరు ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. “రణవీర్ సెల్ఫ్ మేడ్ స్టార్ మాత్రమే” అంటూ మరి కొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి పోస్టులన్నీ చూసి ఇది నెగెటివ్ పీఆర్ అనే అనుమానాలు మొదలయ్యాయి. కొందరు అయితే ఇది రణబీర్ కపూర్ టీమ్ నుంచే నడుస్తున్న క్యాంపెయిన్ అని ఆరోపిస్తున్నారు. ఇంకొన్ని పోస్టులు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఒక పోస్ట్‌లో రణబీర్‌ను ధురంధర్‌లో రణవీర్ లుక్‌లో చూపిస్తూ.. “రణబీర్ ఈ సినిమా చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యేది” అని రాశారు. మరోవైపు రణవీర్ ఫ్యాన్స్ సైతం తగ్గేదేలే అన్నట్లుగా పోస్టులు పెడుతున్నారు. “హమ్జా పాత్ర కోసం రణవీర్ నిజమైన పొడవాటి జుట్టే పెంచాడు.. విగ్ కాదు” అంటూ కామెంట్స్ మొదలు పెట్టారు. కొందరైతే రణబీర్‌ను రణవీర్‌కి చీప్ కాపీ అంటూ విమర్శించారు. ఈ పేడ్ పీఆర్ యుద్ధంలో ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ధురంధర్ రణవీర్ సింగ్‌ను మళ్లీ టాప్‌లోకి తీసుకొచ్చింది. వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో అతని స్టార్‌డమ్‌కు వచ్చిన దెబ్బను ఈ సినిమా పూర్తిగా కవర్ చేసింది. మరోవైపు రణబీర్ కపూర్ సైతం కెరీర్ పీక్‌లోనే ఉన్నాడు. రామాయణం, లవ్ అండ్ వార్, ఎనిమల్ పార్క్ 2 లాంటి భారీ సినిమాలు అతని లైనప్‌లో ఉన్నాయి. వచ్చే రెండేళ్లలో రణబీర్ సైతం ఇండస్ట్రీలో తన హవా చూపించబోతున్నాడు.
Bichukle himself is a cheap copy of RANBIR KAPOOR.pic.twitter.com/wu1hqZgFAq https://t.co/Jys81699DX
— Arthur (@criticizerkf) February 2, 2026
Maybe Dhurandhar is better than Animal but Ranveer Singh couldn’t match Ranbir Kapoor even by 1% when it comes to acting pic.twitter.com/2BwuCCDuPv
— Tha7a fan (@ExposeDhonifan) February 2, 2026
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!