Amazon Layoffs: భారత్‌లోనూ అమెజాన్ ఉద్యోగాల కోతలు.. కార్పొరేట్ టీమ్స్ దెబ్బ.. ఫ్రంట్‌లైన్ జాబ్స్ సేఫ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Layoffs: అమెజాన్‌లో భారీగా ఉద్యోగ కోతలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వార్తతో ప్రపంచ టెక్ రంగం కుదేలైంది. ఈ వారం అమెజాన్ భారీగా ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లోనూ అమెజాన్ ఉద్యోగాల కోతలు ఉండనున్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వందల మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో ఇబ్బందిపడుతున్నారు. ఉద్యోగ కోతలకు సంబంధించి తాజాగా అమెజాన్ బాధిత ఉద్యోగులకు అధికారిక ఈమెయిల్స్ పంపడం మొదలుపెట్టింది. ఉద్యోగం ముగిసే తేదీ, పరిహారం, తదితర సౌకర్యాల వివరాలు ఆ మెయిల్స్‌లో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. గత మూడు నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించడం ఇదే తొలిసారి. ఇప్పటికే 2025 ఏడాది ముగింపులో దాదాపు 14 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఇప్పుడు రెండో సీజన్‌లో దాదాపు 16 వేల కోతలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేవలం మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ కోతలు విధించింది.
READ MORE: స్క్వేర్ సెన్సార్ సెల్ఫీ కెమెరా.. యాపిల్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్న Oppo Find X10, హువావే
Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
ఈ ఉద్యోగాల కోతను అమెజాన్ తన చీఫ్ పీపుల్ ఆఫీసర్ బెత్ గాలెట్టి అధికారికంగా ప్రకటించారు. జనవరి 28న విడుదల చేసిన బ్లాగ్‌లో ఆమె ఈ నిర్ణయం గురించి వివరించారు. సంస్థ పనితీరును మరింత సరళంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నామని చెప్పారు. అమెరికాలో ప్రభావితమైన ఉద్యోగులకు మరో 90 రోజుల సమయం ఇచ్చారు. ఈ సమయంలో వారు సంస్థలోనే ఇతర ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇతర దేశాల్లో మాత్రం స్థానిక చట్టాల ప్రకారం ఈ ప్రక్రియ మారుతుంది. ఈసారి ఉద్యోగాల కోత ప్రధానంగా కార్పొరేట్ విభాగాల్లోనే జరిగింది. టెక్నాలజీ, రిటైల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ప్రైమ్ వీడియో, మీడియా విభాగాలు, అలాగే హెచ్‌ఆర్ లాంటి అంతర్గత సపోర్ట్ టీమ్స్ ఇందులో ఉన్నాయి. గోదాములు లేదా డెలివరీ లాంటి ఫ్రంట్‌లైన్ ఉద్యోగాలు మాత్రం ఎక్కువగా ప్రభావితంకాలేదని సమాచారం. దేశాల వారీగా వివరాలు ఇవ్వకపోయినా, భారత్ సహా అంతర్జాతీయ టీమ్స్ ఈ గ్లోబల్ మార్పుల్లో భాగమయ్యాయని అమెజాన్ స్పష్టం చేసింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అమెజాన్ కొంత మద్దతు అందిస్తోంది. ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా కొంతకాలం పని చేయనవసరం లేని మార్పిడి సమయం ఇస్తోంది. ఈ సమయంలో జీతం, కొన్ని ప్రయోజనాలు కొనసాగుతాయి. అదనంగా పరిహారం, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి సహాయం, అలాగే ఏడాది పాటు ఉచితంగా AWS స్కిల్ బిల్డర్ యాక్సెస్ ఇస్తోంది. ఇక ముందూ ఉద్యోగాల కోతలు ఉంటాయా అన్న ప్రశ్నకు అమెజాన్ ప్రస్తుతం మాత్రం సరైన సమాధానాన్ని వెల్లడించలేదు. రాబోయే కొన్ని నెలల్లో మరిన్ని కోతలు ప్రకటించే ఆలోచన లేదని చెప్పింది.
READ MORE: World Cancer Day 2026: ఈ ఆహారం తినండి.. క్యాన్సర్‌కు దూరంగా ఉండండి..!
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!