Lok sabha: సీఈసీని తొలగించాలంటూ స్పీకర్‌కు నోటీసు.. 190 మంది ఎంపీలు సంతకాలు
- దేశ రాజకీయాల్లో మరో సంచలనం
- ఈసీని తొలగించాలంటూ స్పీకర్‌కు నోటీసు
- 190 మంది ఎంపీలు సంతకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను (Chief Election Commissioner) పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు అధికారికంగా నోటీసు ఇచ్చాయి. ప్రతిపక్షం ఇచ్చిన నోటీసుపై 190 మంది ఎంపీలు సంతకం చేశారు. నోటీసును లోక్‌సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ సమర్పించారు. ఎన్నికల నిర్వహణలో తటస్థత పాటించలేదని, కొన్ని నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఈ చర్యకు దిగినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయని, వాటిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. అందువల్ల ఆయన్ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో నోటీసు సమర్పించినట్లు వెల్లడించారు.
ఇక ఈ నోటీసుపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల వ్యవస్థ స్వతంత్రతను కాపాడే దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ వ్యవహారం ముందుకు ఎలా సాగుతుందో, పార్లమెంట్ లేదా సంబంధిత అధికార సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ పరిణామం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. ఎవరైనా టేబుళ్లపై ఎక్కితే ఇలాంటి చర్యలు తీసుకుంటామని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు. సభ లోపల, వెలుపల సభ గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
త్వరలో తమిళనాడు, బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇలాంటి తరుణంలో సీఈసీని తొలగించాలని విపక్షం నోటీసు ఇవ్వడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?