మంచిర్యాల జిల్లా.. నస్పూర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై ఎస్సై దురుసుగా ప్రవర్తించాడని బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.. తమపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు.. పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బీజేపీ నాయకులను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.
READ MORE: Sam Pitroda: అశ్లీల వీడియోలపై పిట్రోడా సంచలన ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్ర విద్యాశాఖ
తీగల పహాడ్ పోలింగ్ స్టేషన్ వద్ద బీజేపీ నాయకులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా ఎస్సై తోసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరగుతుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సైతం సమీపానికి వచ్చారు. దీంతో పోలీసులు రెండు పార్టీల నాయకులను పంపించేశారు. పోలీంగ్ బూత్ వద్ద ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. ఎస్సై తోశాడనే ఆరోపణలపై రామగుండం సీపీ శ్రీనివాస్ వివరాలు సేకరిస్తున్నారు..