స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు జక్కన్న పై సంచలన ఆరోపణలు చేశాడు. రాజమౌళి టార్చర్ భరించలేని ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్ విడుదల చేశాడు. రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని శ్రీనివాస్ వీడియోలో తెలిపాడు. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా శ్రీనివాసరావు వ్యవహరించాడు. సెల్ఫీ వీడియో, లెటర్ ను రాజమౌళి సన్నిహితులకు పంపాడు. వీటి ఆధారంగా రాజమౌళిపై సుమోటో కింద కేసు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
“రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. నేను పబ్లిసిటీ కోసం ఈ వీడియో తీయడం లేదు. మాది 34 ఏళ్ల స్నేహం. సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులకు తెలుసు. ఒక అమ్మాయి వల్ల మేము విడిపోవాల్సి వచ్చింది. అందరి జీవితాలలాగానే మా జీవితంలో కూడా ఓ అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను.. ఆర్యా-2 లాగానే మాది ట్రై యాంగిల్ లవ్‌స్టోరీ. ముగ్గురం క్లోజ్ కాబట్టి ఏం చేద్దామని రాజమౌళిని అడిగాను. నన్ను దూరం పొమ్మన్నాడు. నేను దానికి ఒప్పుకోలేదు. ముగ్గురం కలిసి ఉందాం అంటే ఒప్పుకోలేదు. నేను పెళ్లి చేసుకుంటాను నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది ఇంకా చండాలంగా ఉంటుందని రాజమౌళి అన్నాడు. కాలం అన్ని మార్చేస్తది మీరు శాక్రిఫైజ్ అవ్వండి అన్నాడు. నేను శాక్రిఫైజ్ అన్నాను. ఇదంతా రాజమౌళి స్టార్ డైరెక్టర్ కాకంటే ముందు జరిగింది. వాడి కెరియర్‌కు ముందు జరిగింది. ఇప్పుడు ఈ విషయమంతా ఎవరికో చెప్పానని నన్ను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. ఓ సారి మా ఇద్దరికి ఓ వాగ్వాదం జరిగినప్పుడు మన స్టోరీని సినిమాలాగా తీస్తానని చెప్పాను. అందుకే నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇప్పుడు రాజమౌళి శాసిస్తున్నాడు. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయ్యిందని నాకు బాధేస్తుంది. మీరు కూడా అమ్మాయిలతో పెట్టుకోవద్దు. వాడికి చెప్పిన అర్థమవ్వడం లేదు కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. సుమోటోగా కేసు నమోదు చేయాలి. లై డిటెక్టర్ టెస్ట్ చేసిన నిజాలు రాబట్టాలి. ” అని బాధితుడు శ్రీనివాస్ ఓ వీడియోలో పేర్కొన్నాడు.
NOTE: ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో, సూసైడ్ లెటర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ అంశంపై పోలీసులు, రాజమౌళి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. ఇది అధికారికంగా ధృవీకరించింది కాదు..