బాలీవుడ్ అక్షయ్ కుమార్ పాట చలో మహాకల్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. అక్షయ్ కుమార్ కు శివుడి పట్ల ఉన్న భక్తిని పాట వీడియోలో చూడవచ్చు. ప్రేక్షకులు ఈ పాటలోని సాహిత్యాన్ని చాలా ఇష్టపడుతున్నారు. కానీ.. కొంతమంది పూజారులు వీడియోలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, నటుడు, నిర్మాత విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో అభ్యంతరంపై అక్షయ్ కుమార్ స్పందించారు.
ఈ వివాదంపై అక్షయ్ కుమార్ ఏమన్నారు?
చలో మహాకాల్ పాటలో అక్షయ్ కుమార్ శివలింగాన్ని కౌగిలించుకుంటాడు. లింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ ద్రావణాలు లింగాన్ని కౌగిలించుకున్న అక్షయ్ కుమార్‌పై కూడా పడతాయి. ఈ సన్నివేశంపై పూజారి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ” పార్వతి, శివుడు నా తల్లిదండ్రులతో సమానం. చిన్నప్పటి నుంచి వారిని నా తల్లిదండ్రుల లాగానే భావిస్తున్నాను. వారిని ప్రేమగా కౌగిలించుకుంటే.. తప్పేముంది? ఎవరైనా నా భక్తిని తప్పుగా అర్థం చేసుకుంటే అది నా తప్పు కాదు.” అని అక్షయ్ తెలిపారు.