Sankranthiki Vasthunam : ఓటీటీలోకి “సంక్రాంతికి వస్తున్నాం”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 ఎఫ్ 3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి ఉంది. ఆయా ఆసక్తిని మరింత పెంచే విధంగా సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్లో మిగతా సంక్రాంతి సినిమాల కంటే ముందు వరుసలో నిలిచింది. ఆడియో సూపర్ హిట్ కావడం, డిజిటల్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఈ సినిమాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలాంటి ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. మౌత్ టాక్ బాగా రావడంతో భారీ కలెక్షన్లను సాధిస్తోంది. వారంలోనే రూ.200కోట్ల కలెక్షన్ల మార్క్ దాటి సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకు భారీగా వసూళ్లు సాధించింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో గుడ్‌న్యూస్ వచ్చింది. సాధారణంగా ఓటీటీలోకి వచ్చాకే సినిమాను టెలివిజన్‌లో ప్రసారం చేస్తారు. కానీ, ‘సంక్రాంతి వస్తున్నాం’ రూటే సపరేటు. ఈ చిత్రాన్ని మొదటగా ఓటీటీ కన్నా కూడా జీ తెలుగు టెలివిజన్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ వార్త విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 1 సాయంత్రం 6గంటల జీ తెలుగు, జీ5 ఓటీటీలో ఒకేసారి అందుబాటులోకి రానుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో జీ5 ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. థియేటర్‌లో ఈ సినిమా నిడివి కారణంగా కొన్ని కామెడీ సన్నివేశాలను అనిల్ రావిపూడి తొలగించారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మార్చి 1న స్ట్రీమింగ్ కానున్న వెర్షన్‌లో మిస్ అయిన సన్నివేశాలు ఉంచుతారో? లేదో? చూడాల్సి ఉంది.
READ MORE: Sunil Gavaskar: భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!