Preity Zinta: నాకు రాజ్యసభ సీటు ఆఫర్ చేశారు కానీ.. పొలిటికల్ ఎంట్రీపై ప్రీతీ జింటా క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ సెలబ్రేటీలు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత రాజకీయం వైపు వెళ్లాలను కుంటారు. కొందరు ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తుంటారు. బాలీవుడ్ లో నటులే కాకుండా నటీమణులు సైతం రాజకీయంలో సత్తాచాటుతున్నారు. దీనికి ఉదాహరణ కంగనా రనౌత్.. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రీతి జింటాకు ఓ ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో అభిమానులతో సరదాగా చీట్‌చాట్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ” మీరు సైనికుల కుటుంబం నుంచి వచ్చారు. నువ్వు కూడా ఓ సైనికురాలివే.. హ్యాట్స్ ఆఫ్ యూ.. మీరు రాజకీయాల్లో చేరే ఆలోచన ఉందా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను?” అనే ప్రశ్న సంధించాడు. ప్రీతి జింటా తనకు అవకాశాలు వచ్చినప్పటికీ రాజకీయాల్లో ఆసక్తి లేదని తేల్చి చెప్పేసింది. సైనికుడి కుమార్తెగా గర్వంగా వ్యక్తం చేసింది.
READ MORE: Himachal: రాష్ట్ర పథకాలకు “దేవాలయాల” డబ్బులు.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఆగ్రహం..
Also Read
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ఈ ప్రశ్నపై స్పందించిన ప్రీతి.. నో అంటూ సమాధానమిచ్చింది. “నాకు రాజకీయాలు వద్దు. గత కొన్ని సంవత్సరాలుగా, అనేక రాజకీయ పార్టీలు నాకు టిక్కెట్లు ఇస్తామన్నాయి. రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేశాయి. కానీ నేను మర్యాదగా తిరస్కరించాను. ఎందుకంటే.. రాజకీయంపై నాకు ఆసక్తి లేదు. మీరు నన్ను సైనికుడు అని పిలవడం తప్పు కాదు. ఎందుకంటే నేను ఒక సైనికుడి కుమార్తెను. మరో సైనికుడి సోదరిని. మేము సైనికుల పిల్లలం కాబట్టి భిన్నంగా ఉంటాం. మేము ఉత్తర భారతీయులం లేదా దక్షిణ భారతీయులం, హిమాచల్, బెంగాలీ వాళ్లం కాదు. మేము కేవలం భారతీయులం. అవును దేశభక్తి, జాతీయ గర్వం మా రక్తంలోనే ఉన్నాయి. ” అని ప్రీతి జింటా పేర్కొంది.
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!