రవిచంద్రన్ అశ్విన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. గబ్బా టెస్టు మ్యాచ్ తర్వాత అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అశ్విన్ రిటైర్మెంట్ వార్త విన్న విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. ఇద్దరు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొన్నారు.. ఈ సమయంలో అశ్విన్ విరాట్‌తో ఏదో చెప్పాడు. ఆ తర్వాత కోహ్లీ అతన్ని కౌగిలించుకోవడం కనిపించింది. రీటైర్మెంట్ ప్రకటనకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీకి తన రిటైర్మెంట్ గురించి చెబుతూ భావోద్వేగానికి…
పంజాబ్ బీజేపీ చాలా మంది నేతలపై చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మాజీ క్యాబినెట్ మంత్రితో సహా డజను మంది నాయకులను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. వేటు పడిన వారిలో భగత్ చున్నీలాల్ కూడా ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
పార్లమెంట్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆమె బ్యాగ్ వేసుకుని రావడాన్ని ముస్లింల బుజ్జగింపు రాజకీయంగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఎంపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆమె పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతోంది..
బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై జనవరి 1 నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్‌ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికే భిక్షాటనపై నిషేధం విధించింది. 10 నగరాల్లో ఈ ప్రచారం జరుగుతోంది. అధికార యంత్రాంగం కొన్ని షాకింగ్ విషయాలు కూడా వెల్లడించింది. బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించి ఆరు నెలల పాటు పని చేసేందుకు ఓ సంస్థ సహాయం చేస్తుందని తెలిపింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజా నివేదికలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్ల్యూహెచ్ఓ నీట మునిగి చనిపోయిన మరణాలు, వాటి నివారణపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా నీట మునగడం వల్ల సంభవించే మరణాల రేటులో 38% శాతం తగ్గింది. అయినప్పటికీ.. తక్కువ ఆదాయ దేశాలలో ఈ ముప్పు ఇప్పటికీ చాలా తీవ్రంగా ఉంది. కాగా.. ప్రతి గంటకు సగటున 30 మంది మరణిస్తున్నట్లు తేలింది. మునిగి చనిపోవడాన్ని […]
కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరపూరిత చర్య ఎలా అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్ నిందితుల గుర్తింపును నిర్ధారించే ముందు సీసీటీవీ…
డబ్బులు సంపాదించడం ప్రతి వ్యక్తి కోరిక. దాని కోసం పగలు రాత్రి కష్టపడి పనిచేస్తుంటాం. అయితే.. కొన్నిసార్లు వ్యక్తులకు అదృష్టం కలిసి వస్తుంది. ఎటువంటి కష్టపడకుండానే డబ్బు పొందుతారు. ఓ రైతు విషయంలో కూడా అదే జరిగింది. రూ.287 కోట్ల విలువైన లాటరీ తగిలింది. కానీ.. ఆయన సంతోషించే లోపే ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అసలేం జరిగిందటే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్‌ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
చాలా మంది ప్రైవేట్ ఉద్యోగానికి బదులు ప్రభుత్వ ఉద్యోగానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కర్ణాటకలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాల పనితీరు, ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిళ్లపై ఓ తహసీల్దార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగంలో మిగిలేది లేదని, పానీపూరీ అమ్మే వాడు మనకంటే గొప్పవాడని తహసీల్దార్ చెప్పారు. పానీ పూరీ అమ్మేవాడి సంపాదన కూడా తమ కంటే ఎక్కువేనని ఆ తహసీల్దార్ వ్యాఖ్యానించాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఓ విచిత్రమైన, బాధాకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తంత్ర మంత్రానికి బలై.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు భావించారు. అయితే పోస్ట్‌మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించింది.