తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జరిగింది. రెండు గంటలకు పైగా సమావేశం కొనసాగింది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ పరమైన చిక్కులు లేకుండా న్యాయ నిపుణుల సలహాలతో బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్యాబినెట్ లో అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశ తేదీల ఖరారు అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మార్చి 10 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ .. బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
READ MORE: ICC Champions Trophy: ఇప్పటి వరకు ఏ జట్టు ఎన్ని సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాయంటే!
మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మండలాలను మున్సిపాలిటీలలో విలీన చేయాలని నిర్ణయించారు.. దీంతో పట్టణ జిల్లాగా మేడ్చల్ మారుతుంది. సెర్ఫ్, మెప్మా విలీనంకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ములుగుతో పాటు మరికొన్ని గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా మారిన నేపథ్యంలో.. గ్రామ పంచాయతీల జాబితా నుంచి ఆ గ్రామాలను తొలగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.
READ MORE: ICC Champions Trophy: ఇప్పటి వరకు ఏ జట్టు ఎన్ని సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాయంటే!