టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో తన ప్రసిద్ధ పికప్ హిలక్స్ యొక్క కొత్త బ్లాక్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. భారతదేశంలోని అన్ని టయోటా డీలర్‌షిప్‌లలో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ బుకింగ్ ప్రారంభమయ్యాయి. దీని డెలివరీ మార్చి, 2025లో ప్రారంభమవుతుంది. భారత మార్కెట్లో హిలక్స్ బ్లాక్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 37.90 లక్షలుగా ఉంచారు. దీని లుక్ బ్లాక్ టైగర్ మాదిరిగా ఉంది. ఈ హిలక్స్ డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..
డిజైన్ అదిరిపోయింది..
హిలక్స్ బ్లాక్ ఎడిషన్ దాని పూర్తి నలుపు రంగు బాహ్య థీమ్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో బ్లాక్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్, బ్లాక్ ఫెండర్ గార్నిష్, బ్లాక్ ఫ్యూయల్ లిడ్ గార్నిష్, కస్టమైజ్డ్ హబ్ క్యాప్స్‌తో 18-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీనితో పాటు ఈ కారులో బ్లాక్ అవుట్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్ (ORVM) కవర్లు, బ్లాక్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ డోర్ మోల్డింగ్‌లు, షార్ప్ స్వెప్ట్-బ్యాక్ LED హెడ్‌లైట్లు, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్‌లు కూడా ఉన్నాయి.
క్యాబిన్‌లో 8 అంగుళాల స్క్రీన్..
మరోవైపు.. ఇంటీరియర్‌లో లెదర్ అప్హోల్స్టరీ, డ్యూయల్-జోన్ పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. దీనితో పాటు, కారులో 8-వే పవర్డ్ డ్రైవర్ సీటు, ఆటో-డిమ్మింగ్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి. పవర్‌ట్రెయిన్‌గా, హిలక్స్ బ్లాక్ ఎడిషన్ 2.8-లీటర్ 4-సిలిండర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు ఇంజిన్ గరిష్టంగా 500Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. కారు ఇంజిన్ ను 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేశారు. మరోవైపు, భద్రత కోసం, హిలక్స్ బ్లాక్ ఎడిషన్‌లో 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ వంటి ఫీచర్లు కూడా అందించారు.