మారుతి సుజుకి ఇండియా మార్చిలో తన అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనోపై గొప్ప డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై కంపెనీ రూ.50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కంపెనీ వినియోగదారులకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అందిస్తోంది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ కారు కూడా ఇదే. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుంచి మొదలవుతుంది.
READ MORE: IND vs NZ: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మల్టీఫ్లెక్స్‌లలో లైవ్ స్ట్రీమింగ్
వివరాల్లోకి వెలితే… బాలెనోపై కంపెనీ రూ. 30,000 వరకు నగదు తగ్గింపు, రూ. 20,000 వరకు స్క్రాపేజ్ బోనస్ లేదా రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈ విధంగా, కస్టమర్లు మొత్తం రూ. 50,000 వరకు ప్రయోజనం పొందుతారు. బాలెనో సిగ్మా వేరియంట్‌పై రూ. 30,000, డెల్టా, జీటా, ఆల్ఫా MTపై రూ. 25,000, ఆటోమేటిక్‌పై రూ. 30,000 నగదు తగ్గింపు ఉంటుంది. ఈ కార్లన్నింటిపై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా రూ. 20,000 స్క్రాపేజ్ బోనస్ అందుబాటులో ఉంది.
READ MORE: Wife harassment: భార్య, అత్త వేధింపులకు మరొకరు బలి.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..
2015లో తొలిసారిగా ప్రారంభించబడిన బాలెనోకు ప్రజాదరణ వచ్చింది. బాలెనో భారతీయ కార్ మార్కెట్‌లో విజయాన్ని సాధించింది. దీనికి కారణం ఆ సమయంలో ధర, ఫీచర్లు. SUV బాడీ టైప్‌లో ట్రెండ్ పెరుగుతున్నప్పటికీ, దాని జనాదరణలో ఎలాంటి తగ్గుదల లేదు. గత తొమ్మిదేళ్లలో 1.5 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ బాలెనో విక్రయించబడింది. ఈ కారులో క్రోమ్ యాక్సెంట్‌లు, ఎల్ఈడీ లైటింగ్, గ్రిల్, ఏరోడైనమిక్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడి ఉంది. ఈ కారు క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ముఖ్యంగా.. కాన్ఫిడెంట్ డ్రైవ్ ఫీచర్, ఇంధన-సమర్థవంతమైన ఇంజిన్.