నేడు ఒక కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు పలు ప్రశ్నలు సంధించింది. దేశంలోని పలు రాష్ట్రాలు రేషన్ పంపిణీ వ్యవస్థల ద్వారా నిరుపేదలకు సబ్సిడీతో కూడిన నిత్యావసర సరకులను సరఫరా చేస్తున్నామని చెప్పుకుంటున్నట్లు గుర్తు చేసింది. అయితే ఈ రేషన్ బీపీఎల్(దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు) లబ్ధిదారుల కుటుంబాలకు చేరడం లేదని పేర్కొంది. రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రేషన్ కార్డు ప్రయోజనాలు నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయా? లే అర్హత లేని వ్యక్తుల జేబుల్లోకి చేరుతున్నాయా? అని సుప్రీం అడిగింది. సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్, ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ ప్రశ్నలు సంధించింది. అధిక మొత్తంలో రేషన్ కార్డులు జారీ చేశామని చెప్పుకునే రాష్ట్రాలు రేషన్ కార్డులను ప్రదర్శన కోసం ఉపయోగిస్తున్నాయని కోర్టు మండిపడింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై దాఖలైన కేసును విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
READ MORE:Mammootty : మమ్ముట్టి కోసం స్టార్ హీరో ప్రత్యేక పూజలు
ఇదిలా ఉండగా. ఆదాయపు పన్ను చెల్లించేవారికి ఉచిత రేషన్ కట్ చేసేందుకు ఇప్పటికే కేంద్ర చర్యలు తీసుకుంటోంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం(పీఎంజీకేఏవై) కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హుల్ని ఏరివేయడానికి కేంద్రం నడుం బిగించింది. ఈ విషయంలో ఆదాయపుపన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించింది. లబ్ధిదారుల ఆదాయ వివరాలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్(డీఎఫ్‌పీడీ) విభాగానికి చెందిన సంయుక్త కార్యదర్శికి ఐటీ శాఖ సమకూరుస్తుంది. లబ్ధిదారుల ఆధార్ నంబర్ లేదా పాన్ వివరాలను ఆదాయపుపన్ను శాఖకు డీఎఫ్‌పీడీ అందిస్తుంది. దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థాయిని ఆదాయపుపన్ను శాఖ నిర్ధారించి ఆ వివరాలను ఆహారశాఖకు తిరిగి అందిస్తుంది.
READ MORE: KTR : కేటీఆర్‌పై నమోదైన కేసు కొట్టివేత