ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా 2025 తర్వాత.. ఇప్పుడు అందరి కళ్ళు మరో కుంభమేళాపై ఉన్నాయి. ఈ కుంభమేళా దక్షిణ భారతదేశంలో జరుగుతుంది. తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ‘మహామహం’ (కుంభమేళా) నిర్వహిస్తారు. ఈ ‘మహామహం’లో కూడా దేశం నలుమూలల నుంచి దాదాపు కోటి మంది భక్తులు పవిత్రమైన అమృత స్నానానికి వస్తారు. ఈ కుంభమేళా కూడా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ‘మహామహం’ సందర్భంగా.. “అఖిల భారత సన్యాసి సంఘం” నిర్వహించిన ‘మాసి మహాపెరువిల- 2025’ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ (VHP) అఖిల భారత సంస్థ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, పూజ్యమైన సాధువు రామానంద్ మహారాజ్, వందలాది మంది సన్యాసి జీయర్ స్వామీజీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ‘మహామహం’ లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో 10 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో (మహామహం సందర్భంగా) శాస్త్రీయ, మత, సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై చర్చలు జరిపారు. హిందూ మత పరిరక్షణపై చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో ‘మహామహం’ ఫిబ్రవరి 2016 లో నిర్వహించారు. 10 రోజుల పాటు జరిగిన ఈ మేళాకు 2 కోట్ల 20 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యారు. ఈ ‘మహామహం’ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం కూడా తన సహకారాన్ని అందిస్తోంది.
READ MORE: Pak Vs NZ: పాకిస్తాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్..
ఇదిలా ఉంగా.. భారత్ కు ఘనమైన సంస్కృతి, గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహా కుంభమేళాతో మరోసారి రుజువైంది. మహా కుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు.. మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మార్మోగిపోయింది. అసలు ఆధ్యాత్మిక క్రతువు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రతి ఘట్టం రికార్డులు సృష్టించి.. మహా కుంభమేళా వైభవాన్ని చాటిచెప్పింది. పెద్ద సంఖ్యలో వీఐపీలు త్రివేణిసంగమంలో స్నానానికి తరలిరావడం.. భక్తుల్లో మరింత ఉత్సాహం పెంచింది. ఇన్ని కోట్ల మంది జనం.. అంతా బహిరంగ ప్రదేశంలో జరిగే వేడుక.. ఎవరూ నియంత్రించకుండానే.. భక్తులు స్వచ్ఛందంగా పాల్గొన్న మహా ఉత్సవం.. ప్రపంచాన్ని అబ్బురపరిచింది. నాగసాధువులు, అఘోరాలు, అఖాడాల రాకతో త్రివేణి సంగమానికి కొత్త కళ వచ్చింది. పుణ్యస్నానాలకు సమాంతరంగా పూజలు, యాగాలు, హోమాలు, ఆధ్యాత్మిక వాతావరణానికి కొత్త శోభ నిచ్చాయి. భారత్ లో కుంభమేళాకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో.. ప్రపంచమంతా కళ్లారా చూసింది. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభవానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.