బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ నాయకులపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ళు విసిరారు. బీజేపీ కార్యకర్తలు కర్రలు పట్టుకొని బయటకు వచ్చారు. బీజేపీ కార్యాలయం లోపలికి రాళ్ళు విసరడంతో ఒక దళిత మోర్చా కార్యకర్త తలకి గాయాలయ్యాయి. ఇది ముమ్మాటికీ పోలీసుల వైఫల్యమని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక్కడ వరకు ఎలా రానిచ్చారు అని ప్రశ్నించింది.…
హై కోర్టు తీర్పుపై న్యాయవాదులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. "కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. ఈ ఏడాదిలో అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని సర్వే రిపోర్ట్ వచ్చింది. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. కుట్ర తో చేస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినందుకు కేటీఆర్ విచారణకు వెళ్లారు.
హైకోర్టు తీర్పుతో దూకుడు ఏసీబీ దూకుడు పెంచింది. ఫార్ములా-ఈ రేసు కేసులో పలు చోట్ల ఏసీబీ తనిఖీలు చేపట్టింది.. హైదరాబాద్‌లోని గ్రీన్ కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది.. ఫార్ములా ఈ రేసులో భాగస్వామిగా గ్రీన్కోను అనుమానిస్తుంది.. బీఆర్ఎస్కు గ్రీన్కో నుంచి భారీగా ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు.. క్విడ్‌ప్రోకో జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.. రూ.41 కోట్లు బీఆర్ఎస్కు బాండ్ల రూపంలో చెల్లించి ప్రతిసారీ కోటి రూపాయల బాండ్‌ను బీఆర్ఎస్కు చెల్లించినట్లు ఏసీబీ తెలిపింది.
హై కోర్డులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేసింది. దీంతో నంది నగర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి లీగల్ టీమ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. హై కోర్టు ఫుల్ బెంచ్ వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనే దానిపై బీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఏమి చేయాలి అనే అంశంపై…
ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కారులో సజీవ దహనమయ్యారు. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపై ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షి కథనం వెలువడింది. "పొలంలో వరి నాట్లు వేస్తుండగా.. కారులో మంటలు అంటుకోవడం కనిపించింది. పైపు లైన్ లేకపోవడంతో.. బిందెలతో నీళ్ళు పోసి ఆర్పే ప్రయత్నం చేశాం.
కేటీఆర్‌కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏసీబీ కేసును కొట్టేయాలని కోరుతూ.. కేటీఆర్ కోర్టు గుమ్మం తొక్కిన విషయంతెలిసిందే. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టి వేసింది. ఏసీబీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. కేటీఆర్ అరెస్ట్‌పై స్టేను సైతం ఎత్తివేసింది. కోర్టు తీర్పులో ఏసీబీ దూకుడు పెంచింది. విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రికి సూచించింది.
ఘట్కేసర్ పరిధి ఘాన్ పూర్ ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డులో ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులను శ్రీరామ్, ఓ మైనర్ బాలికగా పోలీసులు గుర్తించారు. మొదట తగలబడిన కార్‌ను చూసి ప్రమాదవశాత్తు మంటలు రావడంతో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనం అయ్యారు అని అనుకున్నారు.
వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లాస్య మధు దంపతుల కూతురు అద్విత(4) అదృశ్యమైంది. డిసెంబర్ 28న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 23న ముగ్గురు మహిళలు చిన్నారి అద్వితను అపహరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా అనుమానిత మహిళల చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. పది రోజులుగా విస్తృతంగా గాలిస్తున్నా ఆచూకీ లభించలేదు. రాష్ట్ర సరిహద్దులు దాటిందన్న అనుమానంతో పోలీసుల విస్తృత గాలింపు […]
బెట్టింగ్‌కు యువకుడి బలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జైనాథ్ మండలం పిప్పర్వాడ గ్రామానికి చెందిన అలిశెట్టి సాయి (23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అభ్యుదయ హాస్టల్ కిచెన్ సహాయకుడిగా పని చేసేవాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పోవడం వల్ల మనస్థాపం చెందాడు. అభ్యుదయ పాఠశాల ఆఫీస్ వంతెనల వద్ద ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. వాదనలో కేటీఆర్ క్వాష్ ను కొట్టివేయ్యాలని ఏసీబీ కోర్టును కోరింది. ఇరు పక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.