నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుల సమావేశం జరుగనుంది. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుస ఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు.
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత దేశం విడిచి భారత్‌లో నివసిస్తున్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు కష్టాలు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు షేక్ హసీనా సహా 96 మంది పాస్‌పోర్టులను పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ విభాగం రద్దు చేసింది. గతేడాది జూలైలో జరిగిన హత్యలలో వారి ప్రమేయం ఉన్నందున చర్యలు తీసుకున్నారు. హసీనాపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ (ICT) హసీనా, పలువురు మాజీ క్యాబినెట్ మంత్రులు, సలహాదారులు, సైనిక- పౌర అధికారులపై అరెస్ట్ వారెంట్లు…
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో నక్సలైట్ల దాడిలో 8 మంది డీఆర్జీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ జవాన్లకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో సైనికులకు అంతిమ వీడ్కోలు పలికారు. వారి త్యాగానికి నివాళులు అర్పించి, వారి త్యాగం వృథా కాకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు.
హైదరాబాద్‌లో గతేడాది విషాదం నెలకొంది. లంగర్ హౌజ్ లో చైనా మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాన్ మృతి చెందాడు. లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ వద్ద సైనికుడి మెడకు మాంజా చుట్టుకుని ప్రమాదం జరిగింది. విధులు ముగించుకుని బైక్ పై ఇంటికి వెళ్తున్న సైనికుడికి ఈ ప్రమాదం జరిగింది. మాంజా మెడకు చుట్టుకోవడంతో సైనికుడికి తీవ్రగాయాలు అయ్యాయి. అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సైనికుడు కోటేశ్వరరావు మృతి చెందాడు.
నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ జరగనుంది. ఈ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నారు. అరవింద్ కుమార్‌ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. ఈడీ బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. ఏసీబీ, ఈడీ విచారణ 10:30 కు ప్రారంభం అవుతుంది.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా నేపథ్యంలో మరోసారి విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కెనడా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై జస్టిన్ ట్రూడో తొలిసారి స్పందించారు. తన రాజీనామాను ప్రకటించిన ట్రూడో, కెనడా అమెరికాలో భాగమయ్యే అవకాశం లేదని అన్నారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో జస్టిన్ ట్రూడో ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్యం, భద్రతా […]
ఫార్ములా ఈ-రేసు కేసులో జనవరి 7న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఇప్పటికే కేటీఆర్‌కు నోటీసు ఇచ్చింది. నేడు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో తనకు సమయం ఇవ్వాలని ఈడీని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్ మెయిల్ పంపారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో.. తీర్పు వచ్చేంత వరకు సమయం ఇవ్వాలని విన్నవించారు. అయితే కేటీఆర్ విజ్ఞప్తిపై ఈడీ అధికారులు స్పందించింది. విచారణకు మరో తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
ఫార్ములా ఈ రేసు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేటీఆర్ క్యాష్ పిటిషన్ హైకోర్టు కొట్టి వేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. "ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే.. మా వాదన కూడా వినాలి"అని కేవియట్ పిటిషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ మూకలు దాడి చేయడం పట్ల బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మంది కార్యకర్తలొచ్చి దాడులు చేస్తుంటే బీజేపీ చూస్తూ ఊరుకోబోదన్నారు. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే.. గాంధీభవన్ సహా కాంగ్రెస్ కార్యాలయాల పునాదులు కూడా మిగలవని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? రాళ్ల దాడులను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించాలనుకుంటోందా? పిల్లలు, వృద్ధులకు రాళ్లు తగిలితే పరిస్థితి ఏ విధంగా ఉండేదో తెలియదా?…
వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.