హై కోర్టు తీర్పుపై న్యాయవాదులతో మాట్లాడుతున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ.. “కేటీఆర్ పై అక్రమ కేసు పెట్టారు. ఈ ఏడాదిలో అన్ని విషయాల్లో ప్రభుత్వం ఫెయిల్ అయింది అని సర్వే రిపోర్ట్ వచ్చింది. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. కుట్ర తో చేస్తున్నారు అని క్లియర్ గా తెలుస్తోంది. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటీస్ ఇచ్చినందుకు కేటీఆర్ విచారణకు వెళ్లారు. ప్రభుత్వం తీరు బాగా లేదు అని న్యాయవాదులతో కలిసి వెళ్తాను అన్నారు. అరగంట సేపు రోడ్డు మీదనే ఉన్నారు. కేటీఆర్ మళ్ళీ విచారణకు వెళ్తాడు కక్ష సాధింపునకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. ఇది కుట్రపూరితంగా పెట్టారు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి.. కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు.” అని హరీశ్ రావు పేర్కొన్నారు.
READ MORE: Uttar Pradesh: ఆరుగురు పిల్లలను భర్త దగ్గర వదిలి.. బిచ్చగాడితో లేచిపోయిన భార్య
కోర్టు కేసును కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. “తప్పు జరిగింది అని కోర్టు చెప్పలేదు. ఇదొక తుఫెల్ కేసు. 9 వ తేదీ ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్తారు. ఇవాళ అరెస్ట్ చేస్తారా? రేపు అరెస్ట్ చేస్తారా? వాళ్ళ ఇష్టం. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. అడ్వకేట్ లు వెళితే తప్పేంటి? రాహుల్ గాంధీ విచారణ కు వెళితే… అడ్వకేట్ లు కూడా వెళ్లారు. గతంలో గ్రీన్ కో కు మేము ఏమి ఇవ్వలేదు. గ్రీన్ కోకు మేము లాభం చేకూర్చినట్లు ఎక్కడా లేదు. ఇక్కడ అవినీతి కి ఆస్కారం లేదు. కాళేశ్వరం ఇష్యూ తర్వాత మాట్లాడదాం. కోర్ట్ జడ్జిమెంట్ వచ్చాక పై కోర్టుకు వెళ్లాలా వద్దా అనేది మా లీగల్ టీమ్ తో చర్చిస్తాం.” అని తెలిపారు.
READ MORE: Oscars 2025 : ఆస్కార్ బరిలో సూర్య కంగువా
రేవంత్ రెడ్డి కేసుపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు ఆ కేసుకు ఈ కేసుకు పోలిక లేదన్నారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారని తెలిపారు. “కేటీఆర్ రాష్ట్రం ఇమేజ్ పెంచినందుకు కేసు పెట్టారు. అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్ పై కేసు పెట్టారు. మాపై కేస్ లు పెడతారని మాకు ముందే తెలుసు. కేసులతో మానసికంగా మమ్మల్ని బలహీన పర్చాలని చూస్తున్నారు.
కేవలం విచారణ కొనసాగించాలని మాత్రమే హై కోర్టు చెప్పింది. తప్పు జరిగింది అని కోర్టు చెప్పలేదు. విచారణ కు సహకరిస్తాం.” అని హరీశ్ రావు వెల్లడించారు.