తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భక్తులు.. టోకెన్ల కోసం తరలి రావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. తాజాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
తెలంగాణ భవన్లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలతో పాటు హరీష్ రావు, కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "ఈరోజు రాత్రి మా అమ్మాయి అమెరికా వెళ్తుంది.. తొందరగా వెళ్లి కలవాలి. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఉన్న ఇబ్బందులతో పోలిస్తే ఈ ఇబ్బంది ఎంత.. ఇదొక లొట్టపీసు కేస్.. వాడు ఒక ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి. ఆయన పీకేది ఏమి లేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.
మోస్ట్ పవర్ ఫుల్ వెపన్ ఇన్వెస్ట్ మెంట్. పెట్టుబడి పెట్టడం ద్వారా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఈ రోజు మీరు చేసే పొదుపు ఫ్యూచర్ లో మీకు అండగా నిలుస్తుంది. ఆపద సమయంలో మీరు సేవ్ చేసుకున్న సొమ్ము ఆర్థిక భరోసాను ఇస్తుంది. ఆపద సమయంలో ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. కుటుంబం అప్పులపాలు కాకుండా కాపాడుతుంది. మరి మీరు కూడా సంపాదించే దాంట్లో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది.…
ఈ నెల 10 నుంచి తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తున్నారు. గత ఏడాది కాలంగా తమ పెండింగ్ బకాయిలు చెల్లించలేదని నెట్ వర్క్ హాస్పిటల్ 10వ తేదీ డెడ్ లైన్ విధించాయి. పెండింగ్ బకాయిల వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నామని తెలిపాయి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రూ. 675 కోట్లు బకాయిలు చెల్లించలేదని వెల్లడించాయి. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 920 కోట్ల రూపాయలు ఆరోగ్య శ్రీ కి చెల్లించింది.. ఇప్పటికీ ఇంకా రూ. 600 కోట్ల రూపాయలు…
సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ ప్రారంభమైంది. నేటి నుంచి(8,9,10) మూడు రోజుల పాటు మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ పేరిట కోఠి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డితో పాటు ఇతర మెట్రో ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు.
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక “సలార్” నిర్మాణ సంస్థ ‘హోంబళే’ ప్రభాస్ తో ఏకంగా మూడు భారీ సినిమాలు లాక్ చేయగా, రీసెంట్ స్ట్రాంగ్ బజ్ ఒకటి వినపడుతుంది.. అది ఏంటంటే.. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో కూడా రెబల్ స్టార్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ.. ప్రజంట్ రివిల్ అయిన ప్రభాస్ లుక్ లల్లో దర్శకుడు లోక్ మూవీ లుక్ కూడా ఉన్నట్లు…
ఏసీబీ కేటీఆర్ సెకండ్ నోటీసు కాపీని విడుదల చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించడం కుదరదనీ ఏసీబీ రెండవసారి కేటీఆర్‌కు స్పష్టం చేసింది. న్యాయవాది సమక్షంలో విచారణ కావాలని కోరటం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. న్యాయవాదిని అనుమతించలేదని సాకుగా చూపి విచారణను తప్పించుకుంటున్నారని ఆరోపించింది. ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అనేది తర్వాత చెబుతామని స్పష్టం చేసింది. ముందు విచారణకు రావాలని కోరింది. విచారణకు హాజరైన తర్వాత మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా ఏ ఏ డాక్యుమెంట్స్ […]
కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "ఏఐసీసీ ఫేక్ న్యూస్ పెడ్లర్లతో నిండిపోయింది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదు.మహిళలకు సాధికారత కల్పించడానికి బదులుగా వారిని చితకబాదారు. ఇళ్లను పడగొట్టడం, కూరగాయల వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారు. గర్భిణీ స్త్రీలను వీధుల్లోకి నెట్టారు. ఇది పాలన కాదు - ఇది మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వం.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. అనుమతులు లేకుండా 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి ఎలా బదిలీ చేశారని ఈడీ ప్రశ్నించింది. “అరవింద్ కుమార్ ఆదేశాలతో ఎఫ్ఈఓకి డబ్బులు బదిలీ చేశాం. తమకున్న పరిధిలోనే డబ్బులను బదిలీ చేశాం. పై అధికారి అనుమతి తీసుకొని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు బదిలీ చేశాం. 46 కోట్ల రూపాయలను విదేశీ […]