కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ పర్యటనకు బయలు దేరారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న ‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’లో పాల్గొననున్నారు. 'టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్' థీమ్‌తో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతుంది.
తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలకు వెళ్లాడు. కాలినడకన కొండపైకి వెళ్లిన ఆయన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆస్ట్రేలియాతో బీజీటీ సిరీస్‌లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు.
ఓ వైపు మెగాభిమానులు.. మరో వైపు సినీ ప్రేక్షకులు ఇస్తోన్న ఆదరణతో ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తోంది. గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.300 కోట్ల వసూళ్లు చేసింది. ఈ సినిమాను తాజాగా ఢిల్లీ…
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కిషన్‌రెడ్డి తన నివాసాన్ని పల్లెటూరు మాదిరిగా అందంగా అలంకరించారు. కార్యక్రమానికి హజరైన ప్రధానికి ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్ల మధ్య మోడీ వేడుక వద్దకు చేరుకున్నారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోడీ.. ప్రముఖ నటుడు చిరంజీవి, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మోడీ తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. గంగిరెద్దులకు ఫలాలు అందించి వస్త్రాలు సమర్పించారు.
భారతదేశ శాశ్వత సంస్కృతి, ఆధ్యాత్మికత, విశ్వాసానికి ప్రతీక అయిన మహా కుంభమేళా సంగం నగరం ప్రయాగ్‌రాజ్‌లో నేటి నుంచి ప్రారంభమైంది. ఈరోజు పౌష్ పూర్ణిమ అమృత స్నానం. గంగా, యమున, సరస్వతి (అదృశ్య) నదుల సంగమంలో ఉదయం నుంచి భక్తులు స్నానాలు చేస్తున్నారు. ఈరోజు దాదాపు కోటి మంది భక్తులు గంగాస్నానం చేస్తారని చెబుతున్నారు. కాగా.. ఈ కుంభమేళాలో పలువురు బాబాలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం..
2024లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాల్లో నార్వే ప్రధాన మైలురాయిని సాధించింది. నార్వేజియన్ రోడ్ ఫెడరేషన్ (OFV) ప్రకారం.. 2024లో విక్రయించిన కొత్త కార్లలో 88.9% పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. 2023లో ఇది 82.4% గా నమోదైంది. యూరోపియన్ యూనియన్ 2035 నాటికి కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే కార్ల అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించింది. ఈ పెరుగుదల 2025 నాటికి అన్ని కొత్త కార్లను జీరో ఎమిషన్ వెహికల్స్‌గా మార్చే లక్ష్యంతో నార్వేను చేరువ చేసింది.
జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై తీవ్రత 6.9గా నమోదైంది. నైరుతి జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో పాటు వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఎంతమేర నష్టం జరిగిందన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం క్యుషు నైరుతి ద్వీపంలో ఉంది. మియాజాకి ప్రిఫెక్చర్‌తో పాటు పక్కనే ఉన్న కొచ్చి ప్రిఫెక్చర్‌కు సునామీ హెచ్చరిక జారీ చేశారు.
ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తన నివాసాన్ని పల్లెటూరి గ్రామంగా తీర్చి దిద్దారు. సంక్రాంతి సంబరాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు.
మధ్యప్రదేశ్‌లోని మోహన్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మతపరమైన పట్టణాల్లో మద్య నిషేధాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఓర్చా, చిత్రకూట్, ఇతర మతపరమైన నగరాల పరిమితుల్లో మద్యం అమ్మకాలు నిషేధించనుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. నలుగురు పిల్లలను కనాలని నిర్ణయించుకున్న బ్రాహ్మణ యువ జంటలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ పరశురామ్ కళ్యాణ్ బోర్డ్ ఛైర్మన్ పండిట్ విష్ణు రాజోరియా రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. పండిట్ విష్ణు రాజోరియా పరశురామ్ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాను కలిగి ఉన్నారు. పరశురామ్ కళ్యాణ్ బోర్డ్ ప్రభుత్వ హయాంలో నడుస్తోంది.