జన సమూహంలోని మహిళలను ఫొటోలు తీస్తూ... ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసిన జగిత్యాలకి చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి మహిళలను అసభ్యకరంగా ఫొటోలు తీస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నాడు. గత కొంతకాలంగా పట్టణంలోని మార్కెట్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో వివిధ అవసరాల నిమిత్తం వచ్చే మహిళల ఫొటోలు దొంగ చాటుగా తీస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు
ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో దాదాపుగా నాలుగు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నప్పటికీ పండగ సీజన్ కావడంతో భారీగా వస్తున్న వాహనాలని క్రమబద్ధీకరించడం పోలీసులకు భారంగా మారింది. తనికెళ్ల సమీపంలో హైదరాబాద్ నుంచి ఒడిస్సా వెళ్తున్న సాయి కృష్ణ ట్రావెల్స్ బస్సును వెనకవైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ట్రావెల్ బస్సు ముందు మరో వాహనాన్ని(లారీ) ఢీకొట్టింది. వెనకనుంచి వచ్చిన లారీ మళ్లీ మరొక…
జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనుకాల ఓ వ్యక్తిని స్నేహితులు బండ రాయితో కొట్టి నిప్పంటించారు. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో జీవనం కొనసాగిస్తున్న వెంకన్నగా పోలీసులు గుర్తించారు.
కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. ఎవరికి పడితే వారికి అనుమతించే విధానముండేది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్నింగ్ వాకర్స్ చిరుతను చూశారు. ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చి.. అక్కడి నుంచి చెట్లలోకి వెళ్లిపోయినట్లు తెలిపారు. మార్నింగ్ వాకర్స్ చిరుత పాద ముద్రలు సైతం గుర్తించారు.ఈ ఘటన తెలియడంతో విద్యార్థులు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన 250కి పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నట్లు రవాణా శాఖ కమిషనర్ వెల్లడించారు. పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణిస్తున్న వాహనాలు, ఇతర నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ బస్సులపై ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదు చేశారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయుటకు కట్టుబడి ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు ఆచరించడానికి, అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చని అభిప్రాయం వ్యక్త చేసింది.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో శనివారం విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది. దక్కన్ కిచెన్…
నేడు జిల్లాలో నాగర్‌కర్నూల్ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. మార్కండేయ లిఫ్ట్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఆయా గ్రామాల్లో సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవాలు, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. బిజినేపల్లి మండలంలోని శాయిన్‌పల్లిలో నిర్మించిన మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి కాలరీస్ రూ. 88.55 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్ డివిడెండ్ చెక్కును రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి అందజేశారు. సింగరేణి కాలరీస్ చెల్లింపు మూల ధనం(పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ) లో 10 శాతాన్ని డివిడెంట్‌గా చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తం సుమారు రూ.173 కోట్లు కాగా.. సింగరేణిలో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో నుంచి…