ఓ వైపు మెగాభిమానులు.. మరో వైపు సినీ ప్రేక్షకులు ఇస్తోన్న ఆదరణతో ‘గేమ్ చేంజర్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తూ దూసుకెళ్తోంది. గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. తొలిరోజున వరల్డ్ వైడ్‌గా రూ.186 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.300 కోట్ల వసూళ్లు చేసింది. ఈ సినిమాను తాజాగా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ ‘గాడ్స్ స్పెషల్ ఏంజెల్స్’లోని చిన్నారులతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు.
READ MORE: Kishan Reddy: రైతులకు సంక్రాంతి గుడ్‌న్యూస్.. రేపటినుంచే పసుపు బోర్డు కార్యకలాపాలు
వీరేంద్ర సచ్‌దేవ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. పిల్లలతో కలిసి సినిమా చూస్తున్న ఫొటోలను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకున్నారు. ‘రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ చేంజర్ చిత్రాన్ని గాడ్స్ స్పెషల్ ఏంజెల్స్‌తో కలిసి వీక్షించటం ద్వారా నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఆ పిల్లల్లో బిగ్ స్క్రీన్‌పై సినిమాను వీక్షిస్తున్నప్పుడు కలిగిన సంతోషం, ఎగ్జయిట్‌మెంట్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని ఆయన క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.
READ MORE: Thailand: ఇకపై అధికారికంగా క్యాసినో.. బిల్లుకు థాయ్‌లాండ్ ఆమోదం
Celebrated my birthday by taking god’s special angels to watch @ramcharan and @advani_kiara ’s movie Game Changer. The joy in their smiles and their excitement of watching a film on the big screen is a moment I will always cherish. pic.twitter.com/oeOTfmjJC4
— Virendraa Sachdeva (@Virend_Sachdeva) January 12, 2025