తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తిరుమలకు వెళ్లాడు. కాలినడకన కొండపైకి వెళ్లిన ఆయన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను నితీశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆస్ట్రేలియాతో బీజీటీ సిరీస్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నాడు.
READ MORE: Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన హరీష్ రావు, కేటీఆర్
ఇదిలా ఉండగా.. తెలుగు కుర్రాడు నితీశ్‌కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టేశాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన అతడు మెల్‌బోర్న్ టెస్టులో జట్టును ఫాల్ ఆన్ గండం నుంచి బయటపడేశాడు. ఈక్రమంలో టెస్టు కెరీర్‌లో 171 బంతుల్లో తొలి శతకం సాధించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్.. తొలి బంతి నుంచి నిలకడైన ఆటతీరును ప్రదర్శించాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు దానిని అధిగమించాడు. ఈ బీజీటీ సిరీస్‌లో ఐదు టెస్టుల్లో నితీశ్ ఐదు టెస్టుల్లో 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెడ్డి రెండో స్ధానంలో నిలిచాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లతో మెరిశాడు.
READ MORE: Rahul Gandhi: మోడీలానే కేజ్రీవాల్ కూడా తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు
ఇక ఆస్ట్రేలియా గడ్డపై సత్తాచాటిన నితీశ్ కుమార్ రెడ్డి తన స్వస్థలమైన విశాఖకు చేరుకున్నప్పుడు.. విమానాశ్రయంలో ఈ తెలుగు తేజానికి ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ముంచెత్తారు. పలువురు అభిమానులు ఆటోగ్రాఫ్‌లు, ఫొటోలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి ఓపెన్ టాప్ వాహనంలో ఇంటికి ర్యాలీగా వెళ్లారు.