తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌పై ఈడీ కీలక చర్యలు తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో అనితా రాధాకృష్ణన్‌కు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. తూత్తుకుడి, మదురై, చెన్నైలలో అనితా రాధాకృష్ణన్‌కు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేయాలని పీఎంఎల్‌ఏ కింద ఆదేశాలు జారీ చేసినట్లు ఈడీ తన ప్రకటనలో తెలిపింది.
READ MORE: Maharashtra: బడ్జెట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు భారీ షాక్..! మహాయుతిలోకి పలువురు ఎంపీలు!
కాగా.. తూత్తుకుడి జిల్లాలో తన కంటూ వ్యక్తిగత బలం కల్గిన నేత అనిత ఆర్ రాధాకృష్ణన్. అన్నాడీఎంకేలో కొన్నేళ్ల పాటూ ఆ జిల్లా కీలక నేతగా ఆయన చక్రం తిప్పారు. 2001 నుంచి 2006 వరకు అన్నాడీఎంకే ప్రభుత్వంలో పశుసంవర్థక, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత సీఎం జయలలితతో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్నా, చివరకు డీఎంకేలో చేరి ఓటమి ఎరుగని నేతగా తూత్తుకుడిలో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం డీఎంకే అధికారంలోకి రావడంతో ఆయన మత్స్యశాఖ మంత్రి అయ్యారు.
READ MORE: Gandhi Tatha Chettu Review: గాంధీ తాత చెట్టు రివ్యూ.. సుకుమార్ కూతురు సినిమా ఎలా ఉందంటే?
2001–2006 మధ్య కాలంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను అనిత ఆర్ రాధాకృష్ణన్ గడించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు ఏడుగురిపై తొలుత ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే, మనీ లాండరింగ్ కేసు కూడా నమోదైంది. 2022లో అక్రమ సంపాదనతో 160 ఎకరాల స్థలాన్ని ఆయన కొన్నట్లు ఈడీ తేల్చింది. అలాగే, మరో 18 చోట్ల కూడా స్థిర, చర ఆస్తులను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీంతో ఆ స్థలాలతో పాటుగా రూ. 6 కోట్ల మేరకు ఉన్న మరికొన్ని ఆస్తులను అటాచ్ చేస్తూ గతంలో ఈడీ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. 2022లో ఆయనకు చెందిన రూ. 6.54 కోట్ల విలువైన 160 ఎకరాల స్థలం, మరో 18 ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు వెల్లడించింది. మళ్లీ ఇప్పుడు తాజాగా ఈ చర్య తీసుకుంది.