ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం ఆసన్నమైంది. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు వెనుకబడి ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత వికసిస్తోందా? అనేది తేలనుంది. అదే […]
రోహిణి అసెంబ్లీ స్థానానికి తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఆప్ అభ్యర్థి ప్రదీప్ మిట్టల్ కు 3235 ఓట్లు, బీజేపీ అభ్యర్థి విజేంద్ర గుప్తా కు 3187 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుమేష్ కు 177 ఓట్లు వచ్చాయి. 48 ఓట్ల ఆధిక్యంలో ఆప్ అభ్యర్థి కొనసాగుతున్నారు.
ఢిల్లీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది. బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. READ MORE: Saurabh Bharadwaj: ఆప్‌ని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది.. మరోవైపు ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది.. […]
ఢిల్లీలో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయనున్నారో నేటితో తేలనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైంది. మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ నిరహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? లేదా రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల అధికార కరువును అంతం చేస్తుందా? అనే దానిపై అందరి దృష్టి ఉంది. అదే సమయంలో గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన…
Delhi Election Results 2025 Live Updates: దేశ రాజధానిలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో భారతీయ జనతా పార్టీ!
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తమ విభేదాలను పక్కన పెట్టాయి. ఇండియా అలయన్స్ గా ఏర్పడి 2024 ఎన్నికల్లో బీజేపీకి చెమటలు పట్టించాయి. ఫలితంగా బీజేపీ మెజారిటీని కోల్పోయింది. ప్రధాని మోడీ మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మిత్రదేశాల మద్దతు తీసుకోవలసి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి టెన్షన్ పెంచిన అఖిల భారత కూటమి ఢిల్లీ ఎన్నికల్లో చెల్లాచెదురుగా కనిపించింది. కాంగ్రెస్ ఒంటరిగా మారింది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ "వీడీ 12". ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సినిమాను రూపొందిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన నుంచే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎన్.శంకర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరిది. శ్రీరాములయ్య, ఎన్కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి సినిమాలతో సంచలన విజయాలు సాధించారు. అప్పట్లో ఈ సినిమాలకు ప్రేక్షకాదరణ మామూలుగా ఉండేది కాదు.. అదే ఊపుతో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర కూడా తన తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడు.
రూపాయికే కిలో, లేదా ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యాన్ని అందరూ చులకనగా చూస్తారు. ప్రతి నెలా వచ్చిన బియ్యాన్ని అమ్ముకుంటూ.. మార్కెట్లో దొరికే సన్న బియ్యం కొనుగోలు చేస్తుంటారు. రేషన్ బియ్యం తింటే శరీరానికి అస్సలు మంచిది కాదనే వదంతులను కొట్టి పారేయండి.. ఇకపై రేషన్ బియ్యం అమ్మవద్దు. ఎందుకో తెలుసా? రేషన్ బియ్యంలో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి తింటే పోషకాలు పుష్టిగా లభిస్తాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. తాజాగా అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఆరోపణలపై లిఖిత పూర్వకంగా స్పందిస్తామని ఈసీ స్పష్టం చేసింది. అన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. "రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం ప్రాధాన్యత ఇస్తుంది.