ఎన్.శంకర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరిది. శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి సినిమాలతో సంచలన విజయాలు సాధించారు. అప్పట్లో ఈ సినిమాలకు ప్రేక్షకాదరణ మామూలుగా ఉండేది కాదు.. అదే ఊపుతో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ తనయుడు దినేష్ మహీంద్ర కూడా తన తండ్రి బాటలో నడిచేందుకు సిద్ధమయ్యాడు.
READ MORE: Delhi Election : ఫలితాల ముందు ఎన్నికల సంఘం పై ప్రశ్నలు లేవనెత్తిన అరవింద్ కేజ్రీవాల్
తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి ముందుకొస్తున్నాడు. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందిన దినేష్ మహీంద్ర, స్క్రీన్‌ప్లే విషయంలో పలు కోర్సులు పూర్తి చేశాడు. త్వరలో ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీని సైతం తన దర్శకత్వంలో తెరకెక్కించనున్నాడు. కొత్త నటులతో పాటు నూతన టెక్నిషియన్లను పరిచయం చేస్తూ తన చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని “ఆరెక్స్ క్రియేషన్స్ “ సంస్థ నిర్మిస్తుంది.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
READ MORE: Steve Smith: స్మిత్ సెంచరీల పరంపర.. ద్రవిడ్, జోరూట్ రికార్డులు సమం