మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా)స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు హైకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. ముడా భూ కేటాయింపు కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతి బీఎంకు ముడా ద్వారా 14 ప్లాట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించి మధ్యతరగతికి పెద్ద ఉపశమనం కలిగించింది. శుక్రవారం ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందించారు. కేంద్ర బ్యాంకు రెపో రేటును 0.25% (25 బేసిస్ పాయింట్లు) తగ్గించిందని ఆయన అన్నారు. ఈ కోత తర్వాత, రెపో రేటు 6.50% నుంచి 6.25%కి తగ్గింది.
ఢిల్లీలో ఎన్నికలు ముగిసి 24 గంటలకు పైగా గడిచింది. ఫలితాలు రావడానికి దాదాపు 36 గంటల సమయం మిగిలి ఉంది. ఇప్పటి వరకు విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది చేసిన ఈ వాదన ఎన్నికల గణాంకాల నిపుణులను కాస్త ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్ పోల్స్‌కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు నిలిచాయి. పోలింగ్ అనంతరం మౌలానా సాజిద్ రషీది నిన్న ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాను జీవితంలో…
శరీరంలో అతి ముఖ్యమైన భాగం కాలేయం. ఇది చాలా పనులు చేస్తుంది. కాలేయం యొక్క విధి రక్తాన్ని ఫిల్టర్ చేయడం, రక్తం నుంచి హానికరమైన పదార్థాలను తొలగించడం, పైత్యరస అనే ద్రవాన్ని ఉత్పత్తి చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం. కాలేయం చెడిపోతే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. లివర్ దెబ్బతింటే... ఆకలి లేకపోవడం, అలసట, కామెర్లు, జ్వరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మందికి లివర్ సమస్యలు పెరుగుతున్నాయి.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారుతుంది. కంపెనీ బోర్డు పేరు మార్పును ఆమోదించింది. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో ఈ సమాచారాన్ని అందించారు. అయితే, జొమాటో బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదు. యాప్‌లో కూడా జొమాటోగానే ఉంటుంది. కంపెనీ పేరు మాత్రమే మార్చనున్నారు. జొమాటో లిమిటెడ్ కంపెనీ కాస్త ఇప్పుడు ఎటర్నల్ లిమిటెడ్ గా మారనుంది.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో రోడ్డుపై ఒక రష్యన్ అమ్మాయి చేసిన హై డ్రామా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వీఐపీ రోడ్డులో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వేగంగా వస్తున్న ఇండిగో కారు యాక్టివాను ఢీకొట్టింది. ఆ స్కూటీపై ముగ్గురు యువకులు ఉన్నారు. కారు ఢీకొన్న తీరు చాలా తీవ్రంగా ఉండటంతో స్కూటర్ నడిపే వ్యక్తి కొన్ని మీటర్ల దూరంలో పడిపోయాడు. మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కారులో ఒక యువకుడు,…
అమెరికా నుంచి భారతదేశానికి అక్రమ వలసదారులు తిరిగి వచ్చారు. 104 మంది భారతీయులు పంజాబ్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపుతున్న తీరుపై గురువారం ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రయాణం అంతా చేతులకు, కాళ్లకు బేడీలు వేశారని, అమృత్సర్ విమానాశ్రయంలో దిగిన తర్వాతే తీసినట్లు బహిష్కరణకు గురైన వారు తెలిపారని రాజ్యసభలో ప్రస్తావించారు.
కర్ణాటకలోని బెంగళూరు నుంచి ఒక ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు బిస్కెట్లు పంపిణీ చేశాడు. ఇందులో వింత ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఈ బిస్కెట్లు పంపిణీకి కారణమే పెద్ద వింత.. ఆ ఆటో డ్రైవర్ తన భార్య పుట్టింటికి వెళ్లడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషంలో అతను తన ఆటోలో ప్రయాణించిన వాళ్లకు బిస్కెట్లు పంపిణీ చేశాడు.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. రెండు మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నాడని అతన్ని బెట్టింగ్ వ్యవహారంలో అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయం మీద వైజయంతి మూవీ సంస్థ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.. ఆన్లైన్ గేమ్ కారణంగా ఎస్సార్ నగర్ పోలీసులు నీలేష్ చోప్రా అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. భారతదేశం సాధించిన విజయాలు, మన నుంచి ప్రపంచం ఆశించేవి, సామాన్యుల ఆత్మవిశ్వాసం, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరంగా చర్చించారు.