స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ “వీడీ 12”. ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సినిమాను రూపొందిస్తున్నారు.నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన నుంచే దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
READ MORE: YSRCP: అక్కడ వైసీపీ నేతలకు కొత్త టెన్షన్..!
తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డెట్ వచ్చింది. ఈ రోజు(శుక్రవారం) మూవీ మేకర్స్ “వీడీ 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 12వ తేదీన “వీడీ 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరీటాన్ని చూపించడంతో పాటు ‘ది సైలెంట్ క్రౌన్, అవేట్స్ ది కింగ్..’ అని క్యాప్షన్ రాసి ఉంది. ఇది ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ప్రేక్షకులు ఆదరించేలా, ఎప్పుడూ గుర్తుంచుకునేలా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సినిమా మేకర్స్ తెలిపారు.
READ MORE: Jack Teaser : యాక్షన్ కు యాక్షన్.. కామెడీకి కామెడీ.. టీజర్ తోనే అదరగొట్టిన స్టార్ బాయ్ సిద్ధు