భద్రతను దృష్టిలో ఉంచుకుని భారతదేశం 2020లో కొన్ని చైనీస్ యాప్‌లను నిషేధించింది. అయితే.. ప్రస్తతం మళ్లీ ఈ యాప్స్ తిరిగి భారత్‌లోకి వచ్చాయి. 36 యాప్‌లు లను తిరిగి జాబితా చేరాయి.
భారత ఆటోమొబైల్ రంగం జనవరి 2025లో మంచి ఫలితాలను చవిచూసింది. స్కోడా కొత్త కార్లను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఇది కారు ప్రియులలో విపరీతమైన ఉత్సాహాన్ని రేకెత్తించింది. కాగా..ఇటీవల విడుదలైన స్కోడా కైలాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. జనవరి 2025లో అత్యధికంగా 1,242 యూనిట్లు అమ్ముడయ్యాయి. ‘స్కోడా కైలాక్’ SUV బుకింగ్స్ డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 1,242 కస్టమర్లు దీన్ని […]
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఈ-విటారా కారును భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ- విటారా ఎస్యూవీ లాంచ్‌కు సిద్ధమవుతోంది. మార్చి 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జపాన్, యూరప్‌లతోపాటు 100కి పైగా దేశాలకు ఈ-విటారా కారును ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది. ఇటీవల ఈ-విటారా ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కలిగించింది.
రాష్ట్రపతి భవన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం ఇది. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. కాగా నేడు (బుధవారం 12 ఫిబ్రవరి).. రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ (Personal Security Officer) హోదాలో పని చేస్తున్న పూనమ్ గుప్తా వివాహం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించారు.
గత ఏడాది జూలై-ఆగస్టులో విద్యార్థుల నిరసనలు, తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ దేశంలో భారీ హింసను చూసింది. బంగ్లాదేశ్‌లో పదవీచ్యుతుడైన మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా వాజిద్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ చర్యలో కనీసం 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం బుధవారం అంచనా వేసింది.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానంపై ఉగ్రదాడి బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్న మోడీ నేడు రెండు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు. కాగా.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ ప్రయాణించే విమానం సాధారణ విమానం కాదు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ విమానం ఎంత ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇదేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రపంచ జనాభాలో నాలుగో వంతు భారత్, చైనాల్లోనే నివసిస్తోంది. డ్రాగన్ దేశంలో 60 ఏళ్లలో మొదటిసారి జనాభా వృద్ధిరేటు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియా జనాభా 141.2 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాదిలోనే భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా అవతరిస్తుందన్నది ఐక్యరాజ్యసమితి అంచనా. కాగా.. మన దేశంలో మధ్యతరగతి జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్స్యూమర్ ఎకానమీ ప్రకారం.. ప్రస్తుతం (2025) దేశ జనాభాలో 40 శాతం మంది మధ్య తరగతిలో ఉన్నారు.…
64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం మారబోతోంది. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకువస్తోంది. దీనిని రేపు అంటే గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇంతలో దాని ముసాయిదా బయటకు వచ్చింది. ఇది 600 పేజీలకు పైగా ఉంది. ఈ కొత్త చట్టం ఆదాయపు పన్ను చట్టం 2025 అని పిలుస్తారు. దీనిని ఏప్రిల్ 2026 నుంచి అమలు చేయవచ్చు.
బ్రహ్మానందం ఈవెంట్లో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. ఈమధ్య కొంతమంది అలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కానీ తన ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు. డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు. రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ఇది పెరుగుతున్న సమస్య.