Realme 14x 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన పని తీరును ఒకే డివైజ్‌లో అందిస్తుంది. డైమండ్-కట్ ఫినిషింగ్‌తో రూపొందించిన డిజైన్, 6000 mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే IP69 స్థాయి డస్ట్-వాటర్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్‌ను జత చేశారు. 5G కనెక్టివిటీని, స్మూత్ మల్టీటాస్కింగ్ అనుభూతిని ఈ మొబైల్ అందిస్తుంది. సానిక్‌వేవ్ వాటర్ ఎజెక్షన్ టెక్నాలజీ వంటి వినూత్న ఫీచర్ ఫోన్ స్పీకర్లలో చేరిన నీటిని బయటకు పంపేలా సహాయపడుతుంది. స్టైల్, బలం, వేగం – ఈ మూడింటి సమ్మేళనమే రియల్‌మీ 14x 5G అని చెప్పాలి.
Read Also: Dhurandhar: వసూళ్లలో “కల్కి” రికార్డు బద్దలు గొట్టిన ధురంధర్.. నెక్ట్స్ టార్గెట్ పుష్ప-2..
అయితే, ఈ ఫోన్‌కు ప్రధాన శక్తి MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్. 6nm ప్రాసెస్ టెక్నాలజీపై రూపొందించిన ఈ ఆక్టా- కోర్ ప్రాసెసర్ 2.4GHz వరకు వేగాన్ని అందిస్తుంది. గ్రాఫిక్స్ కోసం ARM G57 MC2 GPUని వినియోగించారు. అంటే గేమింగ్, వీడియో ప్లేబ్యాక్, రోజువారీ యాప్ వాడకం అన్నీ ల్యాగ్ లేకుండా స్మూత్‌గా నడుస్తాయి. స్టోరేజ్, మెమరీ విభాగంలో 8GB RAM + 128GB ROM వరకు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 6GB, 8GB RAM ఆప్షన్లతో పాటు 10GB వరకు డైనమిక్ RAM ఎక్స్‌పాంశన్ టెక్నాలజీ కూడా ఉంది. దీంతో ఫోన్‌లో అదనపు వర్చువల్ RAMని ఉపయోగించుకునే వీలుండటంతో మల్టీటాస్కింగ్ మరింత వేగంగా జరగనుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో మీ ఫొటోలు, వీడియోలు, యాప్‌లు, ఫైల్స్‌కి సరిపడా స్థలం లభిస్తుంది.
Read Also: Hair care tips : నూనె రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందనుకోవడం అపోహనా ?
ఇక, డిస్‌ప్లే విషయానికి వస్తే, 6.67 ఇంచ్ (16.94cm) HD+ స్క్రీన్‌ను అందించారు. 1604 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో సూర్యకాంతిలోనూ కంటెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ రిపోర్టింగ్ రేట్ ఉండటంతో స్క్రీన్ రెస్పాన్స్ చాలా వేగంగా ఉంటుంది. 4096 స్థాయిల బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్, 89.97% స్క్రీన్-టు-బాడీ రేషియో, 16.7 మిలియన్ కలర్స్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 83 శాతం NTSC కలర్ గామట్ లాంటి ఫీచర్లు ఈ డిస్‌ప్లేను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
Read Also: Shashi Tharoor: బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించడంపై వివాదం.. దిగ్విజయ్ సింగ్‌కు శశి థరూర్ మద్దతు
కెమెరా విభాగంలో 50MP OV50D ఆటో ఫోకస్ (AF) మెయిన్ రియర్ కెమెరాను అందించారు. 4080 x 3072 రిజల్యూషన్, 27mm ఫోకల్ లెంగ్త్, 75.5° FOV, f/1.8 అపర్చర్, 5P లెన్స్‌తో ఫొటోగ్రఫీ క్వాలిటీ చాలా షార్ప్‌గా ఉంటుంది. ఫొటో, వీడియో, స్ట్రీట్ మోడ్, నైట్ సీన్, పనోరమా, పోర్ట్రైట్, టైమ్-ల్యాప్స్, ప్రొఫెషనల్ మోడ్, స్లో మోషన్, మల్టీ-వ్యూ వీడియో, Google Lens వంటి అనేక కెమెరా ఫంక్షన్లు ఉన్నాయి. 1080p @30fps, 720p @30fps వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంటుంది. సెల్ఫీ కోసం 8MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 25mm ఫోకల్ లెంగ్త్, 80° FOV, f/2.0 అపర్చర్, 4P లెన్స్‌తో పాటు బ్యూటీ సెల్ఫీ, పోర్ట్రైట్, పనోరమా, టైమ్-ల్యాప్స్, మల్టీ-సీన్ వీడియో మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్రంట్ వీడియో రికార్డింగ్ 1080p, 720p @30fpsకి సపోర్ట్ చేస్తుంది, డిఫాల్ట్‌గా 720p బ్యూటీ మోడ్ ఎనేబుల్‌గా ఉంటుంది.
భారీ డిస్కౌంట్‌తో ఓ ప్రీమియం గ్యాడ్జెట్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేక ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 16,999 ఉండగా, 17 శాతం తగ్గింపుతో కేవలం రూ. 13,998కే కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు లభించనుంది. అదనంగా, వినియోగదారులకు సురక్షితమైన షాపింగ్ అనుభూతి అందించేందుకు రూ. 86 ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీజు కూడా వర్తిస్తుంది. డిసెంబర్ 31, బుధవారం నాటికి సెక్యూర్ డెలివరీ అందుతుందని కంపెనీ హామీ ఇస్తోంది.