మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్లు? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానాల పనితీరు దుర్భరంగా ఉందని.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు. తాజాగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19 వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ నిర్ణయించారు.
హిమాయత్ నగర్ దోపిడీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి శభాష్ అనిపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోపిడీ జరిగిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తమయ్యి నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.. మూడు కోట్ల రూపాయల సొత్తు దొంగిలించారని.. సొత్తు విలువ బహిరంగ మార్కెట్ విలువ అయిదు కోట్లు పైనే ఉంటుందన్నారు..
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి కేసులో మరో ఏడుగురిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, భద్రాచలంకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన విషయం తెలిసిందే. మొత్తం 18 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.
మస్తాన్ సాయి కేసులో పోలీసులు కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సైబర్ నేరం, లైంగిక దోపిడీ, బ్లాక్ మెయిలింగ్ వంటి దురాగతాల కేసులో యూట్యూబర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు.
నేడు సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. తాజాగా మోహన్ బాబు పిటిషన్‌పై హైకోర్టులో కూడా విచారణ జరిగింది. పహాడీషరీఫ్ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగింది. సీనియర్ న్యాయవాది వాదిస్తాడని సమయం కావాలని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణ వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే ఈ కంపెనీ బండ్లనుకొనాలని ఆశ పడతారు.. కాగా.. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల షాట్‌గన్ 650కి చెందిన ప్రత్యేక ఐకాన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని అమెరికాకు చెందిన కస్టమ్ మోటార్‌సైకిల్ తయారీదారు ఐకాన్ మోటోస్పోర్ట్స్ సహకారంతో తయారు చేయనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్లు మాత్రమే తయారు చేసి అమ్ముతుంది.
మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టీవీ, ఇవి మన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. అవి లేకుండా మనం ఆఫీసులో పనిచేయలేం. పడుకోము, తినము. పెద్దవారిలోనే కాదు పిల్లల్లో కూడా స్క్రీన్ అడిక్షన్ బాగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు తమ పని తాము చేసుకునేందుకు చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు. పిల్లలు క్రమంగా దానికి బానిసలవుతున్నారు. పిల్లవాడు మొబైల్ చూడకుండా తిండి తినడు. మొబైల్ ని ముందు పెట్టుకుని తినే పిల్లలను మీరు కూడా చాలా మంది చూసి ఉంటారు. వీటి వల్ల జరిగే అనర్థాలు చాలా…
దేశ రాజధాని దిల్లీ తరహాలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్యం పెరుగుతోంది. దుమ్మూ, ధూళి, వాహనాల పొగ.. గాలిలో కలవడం లేదు. పైపైనే ఒక పొరలా పేరుకుపోతోంది. దీంతో గాల్లో కాలుష్యం పెరిగి.. వాయు నాణ్యత తగ్గుతోంది. దీంతో గాల్లో నాణ్యత క్రమంగా క్షీణిస్తోంది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి ఎక్కువగా కలుషితమవుతోంది. ఈ వాయు కాలుష్యం ధాటికి ఊపిరితిత్తులు విలవిలలాడుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్తున్నారు. రేపు ఆయన వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమవుతారు. ప్రధాని మోడీ, ట్రంప్ చివరిసారిగా ముఖాముఖి సమావేశం జరిగి ఐదు సంవత్సరాలు అయ్యింది. కానీ అధ్యక్షుడు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ సమావేశం భారతదేశం-అమెరికా సంబంధాలకు కొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా..