64 ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం మారబోతోంది. ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును తీసుకువస్తోంది. దీనిని రేపు అంటే గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. ఇంతలో దాని ముసాయిదా బయటకు వచ్చింది. ఇది 600 పేజీలకు పైగా ఉంది. ఈ కొత్త చట్టాన్ని ఆదాయపు పన్ను చట్టం 2025 అని పిలుస్తారు. దీనిని ఏప్రిల్ 2026 నుంచి అమలు చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ బిల్లును సవరించవచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లును గత వారం కేబినెట్ ఆమోదించింది.
READ MORE: Vishwak Sen: మిడిల్ ఫింగర్ వివాదంలో విశ్వక్.. నేను ప్రతిసారి తగ్గను?
ఆదాయపు పన్నుకు సంబంధించిన నిబంధనలను సులువుగా చేయడం, అనవసరమైన నిబంధనలను తొలగించడం, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యే విధానంపై ఈ బిల్లు దృష్టి పెడుతుంది. పాత చట్టంలోని వేలాది నిబంధనలు తాజా బిల్లులో తొలగించారు. 1961లో అమలులోకి వచ్చిన పాత చట్టంలో అనేక విభాగాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయపు పన్ను చట్టం నుంచి వాటిని తొలగించడం వల్ల ఆ విభాగాలు నిరుపయోగంగా మారాయి. ఈ కొత్త చట్టంలో వాటిని పూర్తిగా తొలగించారు.
READ MORE: 1984 anti-Sikh riots: 1984 సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ..
ఇదిలా ఉండగా… కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తన బడ్జెట్ ప్రసంగంలో ఆదాయపు పన్ను కొత్త శ్లాబ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండబోదని ఆర్థిక మంత్రి ప్రకటించారు. జీతభత్యాలకు ఈ పరిమితిని రూ.12 లక్షల 75 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. మధ్యతరగతికి మరింతగా ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తే డిమాండ్ పెరుగుతుందని, ఇది ఆర్థిక వ్యవస్థను మళ్లీ వేగంగా కదిలించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.