యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలై పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇందులో ఎంతో కీలకమైన కలీన్ భయ్యా పాత్రలో పంకజ్ త్రిపాఠి కనిపించారు. బాలివుడ్లోనే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా పంకజ్ దగ్గరయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. ప్రధానంగా వ్యవసాయం, సుస్థిరాభివృద్ధి, పరిపాలన, రవాణా, విద్య తదితర కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవలు, పరిష్కారాలు అమలు చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది. భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా డిజిటల్ నైపుణ్యాలతో శ్రామిక శక్తిని సన్నద్ధం చేసేందుకు వ్యూహాత్మక సహకారం అందించనుంది. టీ హబ్‌లో గురువారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు గూగుల్ ప్రతినిధులతో…
తెలంగాణ ప్రజల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, కృష్ణా జలాల విషయమై ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వం అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల కేటాయింపు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ WP1230/2023 నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన నేపథ్యంలో మంత్రి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయ వాదులతో కలిసి విచారణకు స్వయంగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…
రాయచోటిలో సినీ నటుడు మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను నాలుగు గోడల మధ్య తొక్కేయాలని చూశారని.. ప్రేక్షకుల మనసులో నుంచి తనను తీయలేరన్నాడు.. రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో జగన్నాథ్ మూవీ టీజర్ లాంచింగ్ కార్యక్రమంలో నిర్వహించారు. టీజర్‌ను లాంచింగ్‌కు ముఖ్యఅతిథిగా సినీ నటుడు మంచు మనోజ్ హాజరయ్యాడు. జగన్నాథ్ మూవీ హీరో రాయలసీమ భరత్, హీరోయిన్ ప్రీతి, యూనిట్ బృందంతో కలిసి మూవీ టీజర్ ను లాంచ్ చేశాడు. అభిమానులతో సందడి చేశాడు.
‘మిసెస్’ చిత్రం ZEE5 ఫ్లాట్ ఫాంపై సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతోంది. జీ5లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం ఆడియెన్స్‌ను మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 7.3 IMDb రేటింగ్‌తో పాటు, గూగుల్‌లో యూజర్ రేటింగ్ 4.6/5తో అత్యధికంగా సర్చ్ చేస్తున్న చిత్రంగా ‘మిసెస్’ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాను బవేజా స్టూడియోస్‌తో కలిసి జియో స్టూడియోస్ నిర్మించింది.
కింగ్ నాగార్జున బుక్‌మై షోలో 'తల' సినిమా మొదటి టికెట్ కొనుగోలు చేశాడు. అనంతరం సినిమా యూనిట్‌కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. వాస్తవానికి 'తల' చిత్రాన్ని దీపా ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గౌడ్ నిర్మాతగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంతో రూపొందించారు. ఈ సిమాతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ ఈ హీరోగా ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు.
తనకు ప్రాణహాని ఉందని లావణ్య పేర్కొంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు ప్రాణ హాని ఉందని.. బతికి ఉంటానో లేదో తెలియదని తెలిపింది. మస్తాన్ సాయి, వాళ్ళ పేరెంట్స్ నన్ను చంపేస్తారని వాపోయింది..
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ పాశ్చాత్య సంస్కృతి అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, భారత్, ఇటలీ, డెన్మార్క్, జపాన్‌తో పాటు భారత దేశానికి కూడా పాకింది. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రేమికుల దినోత్సవాన్ని వ్యతిరేకించే వారిలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముందుంటాయి.
రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. ఏపీ విభజన సమయంలో తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందన్నారు. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైందని తెలిపారు. "నేను ఏ పార్టీని తప్పు పట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే.
తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం హైడ్రా అక్రమ కట్టడాలను తొలగించింది. కోమటికుంట ఎఫ్టీఎల్ లో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. హైడ్రా ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. కోమటి కుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వెల్లడింది.. అలాగే చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు విచారణలో తేలడంతో కూల్చివేతలకు ఆదేశించింది.