బ్రహ్మానందం ఈవెంట్లో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. ఈమధ్య కొంతమంది అలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కానీ తన ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఇటీవల ‘లైలా’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన తెలిసిందే.. ఈ కార్యక్రమంలో అభిమానులు జనసేన జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పద్మవిభూషణ్ గ్రహీత చిరంజీవి స్పందించారు. ‘‘ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంతా జనసేనే. జై జనసేన’ అని అన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి రాజకీయ రీ ఎంట్రీపై ఆశలు చిగురించాయి.
Read Also: Diabetes Symptoms : ఈ లక్షణాలు మీలో ఉంటే.. షుగర్ వ్యాధి బారిన పడ్డట్టే.. ఇప్పుడే చెక్ చేసుకోండి..
ఇదిలా ఉండగా.. బ్రహ్మనందం, రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘బ్రహ్మ ఆనందం’ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. పొలిటికల్ రి ఎంట్రీపై స్పందించారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి, ఆశ లేదని పేర్కొన్నారు.
Read Also: Tooth Brush: మీ టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతున్నారా..? ప్రమాదం పొంచి ఉన్నట్టే..