సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ కలిసి ‘నాదానియన్’ సినిమా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఇబ్రహీం అలీ ఖాన్, ఖుషీ కపూర్ ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మూవీ ‘నెట్‌ఫ్లిక్స్’ లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలు ప్రకటిస్తూ సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది. నెట్‌ఫ్లీక్స్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. తరగతి గదిలో ప్రేమ గురించి లెక్చరర్ ప్రశ్న అడుగుతుంది. మొదట హీరోయిన్‌ను అగినప్పుడు.. ఆమె చెప్పదు. తర్వాత హీరో( ఇబ్రహీం అలీ ఖాన్) చెబుతాడు. హీరో తనదైన శైలిలో వివరించడంతో హీరోయిన్ ఆకర్షితమవుతుంది.
READ MORE: YS Jagan: మిర్చి రైతుల దుస్థితిపై జగన్ ట్వీట్.. రైతులను మోసం చేయొద్దు..!
వాస్తవానికి.. ఇది సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తొలి చిత్రం. కానీ ఖుషీ కపూర్ దీనికి ముందు 2 సినిమాల్లో పనిచేసింది. అయితే, ఖుషీ కపూర్ నటించిన ఈ రెండు చిత్రాలు ఆమెకు ఎటువంటి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. ఖుషీ కపూర్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన స్టార్ కిడ్-స్టారర్ చిత్రం ‘ది ఆర్చీస్’తో తన అరంగేట్రం చేసింది. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. చాలా విమర్శలను ఎదుర్కొంది. దీని తర్వాత, ఖుషీ కపూర్ పెద్ద తెరపై సినిమా చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవల, ఆమె ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో కలిసి ‘లవ్యాపా’ చిత్రంలో కనిపించింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. ఖుషీ కపూర్ ప్రస్తుతం ‘నదానియన్’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది.