మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్‌లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. ఎందుకంటే.. వారికి కారు అవసరం. అలాంటి వారికి కోసం కొన్ని కార్లను పరిచయం చేస్తాం. కారు కొనాలనుకుంటున్న వారు వీటిని చూసి.. ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి..
టాటా టియాగో..
ఇక తక్కువ బడ్జెట్ అంటే టాటా కంపెనీగా చెప్పవచ్చు. టాటా టియాగో కారు కేవలం రూ.4.99 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర) నుంచే లభిస్తోంది. ఈ కారు మొత్తం 27 వేరియంట్లు, 6 కలర్లలో వస్తోంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఈ కారు మైలేజ్ లీటరుకు 19-20 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
మారుతీ సుజుకీ స్విఫ్ట్..
రూ.7 లక్షల బడ్జెట్ కేటగిరీలోకి వస్తే మారుతీ సుజుకీ స్విఫ్ట్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ కారు 5 వేరియంట్లలో లభిస్తోంది. సీఎన్‌జీ వెర్షన్‌లోనూ వస్తోంది. దీని ప్రారంభ ధర రూ.6.49 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర)గా ఉంది. ఈ కారు మైలేజ్ 24.8 కిలోమీటర్ల నుంచి 25.75 కిలోమీటర్ వరకు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
మారుతీ సుజుకీ వేగన్ ఆర్..
మారుతీ సుజుకీ వెగన్ ఆర్ 4 వేరియంట్లలో 9 కలర్లలో వస్తోంది. ఈ కారు ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.33 లక్షలు (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇందులో 998-1197 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌కి 23.56 కిలోమీటర్ల నుంచి 25.19 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
రెనాల్ట్ క్విడ్
రెనో క్విడ్ కారు బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఈ కారు ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.45 లక్షలు (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారు 6 కలర్ల ఆప్షన్స్ లో వస్తోంది. ఇందులో 999 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌కు 21.46 కిలోమీటర్ల నుంచి 22.3 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్..
హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్‌టర్ కారు 12 రంగుల్లో లభిస్తోంది. ఈ కారు ధర రూ.6.13 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతోంది. ఇందులో 1197 సిసీ ఇంజిన్ ఉంటుంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌కి 19.2 కిలోమీటర్ల నుంచి 19.4 కిలోమీటర్ల వరకు ఉంటుంది.