Car Loan: కార్ లోన్ తీసుకునేటప్పుడు ఇది గుర్తుంచుకోండి.. లేదంటే అప్పుల పాలే..
- కార్ లోన్ తీసుకుంటున్నారా?
- ఈ నిబంధన తప్పక పాటించండి
- లేదంటే అప్పుల పాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్‌లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. అయితే.. ఎక్కువ శాతం మధ్యతరగతి వ్యక్తులు కారును లోన్ తీసుకుని కొంటారు. కొందరు మాత్రమే మొత్తం డబ్బులు చెల్లిస్తారు. అయితే.. బ్యాంకులను బట్టి కార్ లోన్స్‌పై వడ్డీ రేట్లు కనిష్ఠంగా 8.70 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటున్నాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, ఈ వడ్డీ రేట్లు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని బ్యాంకులు వెహికల్ ఆన్-రోడ్ ప్రైస్‌పై 100 శాతం వరకు ఫైనాన్స్ ఇస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఈ కార్ లోన్ తీర్చేందుకు 8 ఏళ్ల వరకు సమయం ఇస్తున్నాయి. ఈ కార్ లోన్స్ మీరు నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా తీసుకోవచ్చు. లేదా నేరుగా బ్యాంకుకు వెళ్లి కూడా తీసుకోవచ్చు. లోన్ తీసుకునేటప్పుడు 20/4/10 రూల్ మాత్రం తప్పక పాటించండి.. 20/4/10 రూల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
20/4/10 రూల్ అంటే ఏంటి?
బ్యాంకులో రుణం తీసుకుని కొత్త కారు కొంటున్న వారు తమ బడ్జెట్‌ను నిర్ణయించుకునేందుకు కొన్ని థంబ్ రూల్స్ సాయం చేస్తాయి. అందులో ఒకటే 20/4/10 రూల్. ఈ రూల్ ప్రకారం.. కారు ఆన్ రోడ్ ప్రైస్‌లో 20 శాతం డౌన్‌పేమెంట్‌గా చెల్లించగలగాలి. లోన్ మొత్తం టెన్యూర్ గరిష్ఠంగా 4 సంవత్సరాల లోపే ఉండాలి. ఈఎంఐ మీ నెలవారీ సంపాదనలో 10 శాతానికి మించకుండా చూసుకోవాలి. ఈ విధంగా మీ బడ్జెట్ లెక్కలు వేసుకోవాలి. ఇలా కచ్చితంగా ఫాలో అయినప్పుడు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు.
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ఉదాహరణకు.. మీ నెల సంపాదన రూ.1 లక్ష ఉంటుందని అనుకుందాం. అంటే మీ వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉంటుంది. మీరు కొత్త కారు కోనుగోలు చేద్దాం అనుకున్నప్పుడు ప్రణాళిక సిద్ధం చేయాలి. కారు ఆన్ రోడ్ ధర రూ. 6 లక్షల లోపే ఉండేలా చూసుకోవాలి. థంబ్ రూల్ లెక్క ప్రకారం కారు ఆన్ రోడ్ ధరలో 20 శాతం అంటే రూ.1.2 లక్షలు మీరు డౌన్‌పేమెంట్‌గా పే చేయాలి. మిగిలిన రూ.4.8 లక్షలు రుణంగా తీసుకోవచ్చు. మీ నెల వారీ ఈఎంఐ రూ.10 వేల వరకు ఉండేలా ప్లాన్ చేయాలి. ప్రస్తుతం చాలా బ్యాంకులు 8 శాతం లోపే వడ్డీపై కారు రుణాలు ఇస్తున్నాయి. 4 ఏళ్ల టెన్యూర్ ఎంపిక చేసుకుంటే రూ.4.8 లక్షల రుణంపై ఈఎంఐ రూ.11,718 వరకు పడుతుంది. ఇది మాత్ర తప్పక తెలుసుకోండి.. లేదంటే భారం పెరిగి అప్పులు చేయాల్సి రావచ్చు.
తాజావార్తలు
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు