CM Chandrababu: మాజీ మంత్రి వివేకా హత్యకేసు మరోసారి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులివ్వడం పోలీసుశాఖలో కలకలం రేపింది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామం ఎన్నడూ జరగలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై తాజాగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రసంగించారు. నేను సీఎం గా ఉన్నప్పుడు.. వివేకా.. గుండెపోటుతో చనిపోయినట్టు వార్త వచ్చింది. ఎన్నికల బిజీగా ఉండడం వల్ల అయ్యో పాపం అనుకున్నాం. వైఎస్. సునీత పోస్ట్ మార్టం కావాలని అడిగారు.. ఇలాంటి కరుడు గట్టిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఏమి జరుగుతుంది. నేరస్థుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం. ఇప్పుడు శంకరయ్య మాట్లాడడానికి ఎంత ధైర్యం ఉండాలని తనకి లీగల్ నోటీసులు ఇచ్చిన శంకరయ్య పై సీఎం ఫైర్ అయ్యారు. శంకరయ్య అనే వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదన్నారు.. పులివెందుల CI గా శంకరయ్య ఉన్నారని…IG ఇంటెలిజెన్స్, CMO నుంచి కరెక్ట్ సమాచారం రాలేదని చెప్పారు.. సునీత పోస్ట్ మార్టం అడిగిన తర్వాతనే అది హత్య గా తెలిసిందని గుర్తు చేశారు…
READ MORE: CM Chandrababu: అలిపిరి బ్లాస్ట్‌లో నన్ను కాపాడింది ఆయనే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు..
ఆ సీఐకి ఎంత ధైర్యం ఉండాలని హెచ్చరించారు.. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నాయకులను ఇంత వరకు చూడలేదని.. కానీ ఇపుడు నేర ప్రవుత్తి ఉన్న వారే రాజకీయాలకు వస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.. సీఐ డ్యూటీలో ఉన్నాడా లేదా? సీన్ ఆఫ్ అఫెన్స్ ను ఎవరు ప్రొటెక్ట్ చేయాలి..? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి కి సంబంధం లేదా..? అని నిలదీశారు. నేరస్తులతో కలిసి నా మీదనే కేసు పెట్టే స్థాయికి పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఎటు పోతుందని మండిపడ్డారు.. కారణం చెబితే పోలీసులు అనుమతి ఇస్తారు.. కానీ సమాచారం ఇవ్వకుండా యాత్రలు చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యులు..? అని సీఎం ప్రశ్నించారు. రౌడీ ఇజం చేసే వారంతా రాజకీయం చేస్తున్నారు.. మహిళ పై నేరాలకు పాల్పడుతున్న 343 మంది కి ఈ సంవత్సర కాలంలో శిక్షలు పడ్డాయన్నారు…