చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన దురదృష్టకర తొక్కిసలాట సంఘటనపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని ఆయన వాపోయారు. వేడుకల నిర్వహనపై అసహనం వ్యక్తం చేశారు. నిర్వాహకులు వేడుకలను బాగా ప్లాన్ చేసి ఉండాల్సిందన్నారు. అభిమానులు ప్లేయర్స్ పట్ల పిచ్చిగా ఉన్నారన్నారు. ఈ తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడారు. అభిమానులు ఎక్కువగా తరలిరావడంతో ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం రోడ్‌షోను నిలిపివేసిందని స్పష్టం చేశారు. కానీ, స్టేడియం వెలుపల తొక్కిసలాట జరుగుతుందని ఊహించలేదన్నారు. నష్టాన్ని నియంత్రించేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
READ MORE: RCB Stampede: సీఎం, డిప్యూటీ సీఎం హాగ్స్, ఫోటోల్లో బిజీగా ఉన్నారు.. తొక్కిసలాటను పట్టించుకోలేదు..
మరోవైపు.. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 50 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే. ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాద ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేఎస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నగర పోలీస్ కమిషనర్‌తో మాట్లాడాను. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేం. ప్రజలంతా సంయమనంతో ఉండాలి. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమాన్ని పది నిమిషాల్లోనే ముగించాం. లక్షలాది మంది అభిమానులు వచ్చారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు.
READ MORE: RCB Stampede: తొక్కిసలాట ఘటనపై బీజేపీ సంచలన ఆరోపణలు.. దీనికి కారణం మీరే..!