హనుమకొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ సృష్టించింది. బుధవారం రాత్రి హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. సీ.సీ కెమెరాల్లో లభించిన వీడియో ఆధారంగా వరంగల్‌లోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించినట్లు గుర్తించారు.
నవ మాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతో కడతేర్చింది. మైలార్ దేవ్ పల్లి ఆలీ నగర్ లో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 15 రోజుల పసికందుని తల్లి చంపేసింది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడింది.
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో విషాదం చోటుచేసుకుంది. తల్లి ముగ్గురు చిన్నారులను అన్నంలో విషం కలిపి తినిపించింది. తాను ఆహారం ద్వారా విషం తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారులు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియా (10), గౌతమ్ (8) మృతిచెందారు. తల్లి రజిత తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
బెంగళూరులో మరో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. హులిమావు ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేస్‌లో దాచి పెట్టిన ఘటన చోటు చేసుకుంది. నిందితుడిని మహారాష్ట్ర నివాసి రాకేష్‌గా, మృతురాలిని 32 ఏళ్ల గౌరీ అనిల్ సాంబేకర్‌గా గుర్తించారు. హత్య తర్వాత, రాకేష్ స్వయంగా తన భార్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ భయంకరమైన నేరం గురించి తెలియజేశాడు.
సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో డీ లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పునర్విభజన పారదర్శనకంగా జరగాలన్నారు. "జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజక వర్గ పునర్విభజన చేయాలి. వాజ్ పేయి కూడా పునర్విభన 25 ఏళ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయాలని ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర మంత్రి అంటున్నారు. కేంద్రానికి .. తెలంగాణ…
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు అవయవ దానం బిల్లును ప్రవేశపెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ అవయవ దానానికి ముందుకొచ్చారు.
కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఏర్పాటు కానున్న 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో హైదరాబాద్‌లో13, వరంగల్ అర్బన్‌లో ఒక స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. 2020లో 14 కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు జరిగాయి. కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల విభజన, ప్రాంతాలు, బదలాయింపు పనులన్నీ ప్రస్తుతం పూర్తయ్యాయి. READ MORE: Delimitation: జనాభా నియంత్రణ […]
ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి) లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ అంశపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే ఆపాలని పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఆ యోధుడి జన్మదినోత్సవాన్ని…
సభలో కాగ్ నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. కాగ్ నివేదిక ప్రకారం.. 2023-24 బడ్జెట్ అంచనా రూ. 2,77,690 కోట్లు, చేసిన వ్యయం రూ. 2,19,307 కోట్లు. బడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయం లభించింది..