ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) శుక్రవారం తలపడ్డాయి. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను వీక్షించిన అభిమాని ఓ కీలక విషయాన్ని బట్టబయలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న జనాలు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెంగళూరు దక్షిణ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. హుళిమావు సమీపంలోని దొడ్డకమ్మనహళ్లికి చెందిన రాకేశ్ అనే వ్యక్తి తన భార్య గౌరి అనిల్ సాంబెకర్ (31)ను కిరాతకంగా కడతేర్చిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్‌కేసులో నింపేశాడు. మొదట్లో ఈ ఘటన అనుకోకుండా జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు. కానీ దర్యాప్తులో ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని తెలుస్తోంది.
కార్పొరేట్ సంస్థలను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సమ్మెట్లో అబద్ధాలు చెప్పడం విచారకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.. ఒక ప్రముఖ ఛానల్ ప్రధానమంత్రితో నిర్వహించిన సమ్మెట్లో దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి లేదని, అభివృద్ధి పెరిగిందని, కాంగ్రెస్‌లో అవినీతి పెరిగిందని చెప్పడం సత్య దూరమని ఆయన అన్నారు. ఎన్. పి. ఎ. కింద 16 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్వయంగా చెప్పారని, 2014 కంటే ముందు రెండున్నర లక్షల కోట్లు ఉంటే, బీజేపీ…
మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే పది రోజుల్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నోటిఫికేషన్ గురించి సమాచారం అందించారు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. క్లైమోర్ మైన్స్ కే భయ పడలేదు.. కామెడీ పీస్ కు భయపడతామా? అన్నారు..
సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న తొలిసారి కలిసి ‘సికందర్’ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ జంటను తెరపై చూడటం అభిమానులకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ వీరిద్దరి మధ్య 31 సంవత్సరాల వయస్సు తేడా. దీని కారణంగా.. సల్మాన్, రష్మిక మందన్నల ఆన్-స్క్రీన్ జతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రష్మిక తనకు సల్మాన్ తో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు.. తన మొదటి రియాక్షన్ ను వ్యక్త పరిచింది. ఆజ్‌తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ‘సికందర్’లో సల్మాన్‌తో కలిసి […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం షాజాద్, తాను ఎలాంటి నేరం చేయలేదని పేర్కొంటూ ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై మోపిన ఆరోపణలు అవాస్తవమని, తనను ఇరికించడానికి కుట్ర పన్నారని అందులో పేర్కొన్నాడు. తన క్లయింట్‌పై తప్పుడు కేసు నమోదు చేశారని ఇస్లాం తరఫు న్యాయవాది పిటిషన్లో పొందుపర్చారు. అతను ఎప్పుడూ ఏంటి నేరం చేయలేదని పిటిషన్లో వివరించారు.
బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి విష్ణు ప్రియ మరోసారి రానుంది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే పంజాగుట్ట పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో విష్ణుప్రియకు చుక్కెదురైంది. విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు విష్ణు ప్రియ హాజరుకానుంది.
రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 9వ మ్యాచ్‌లో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది వరుసగా రెండో విజయం. ఈ విజయంతో బెంగళూరు జట్టు 17 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సీఎస్కేని వారి సొంత మైదానంలో ఓడించింది. చెన్నై కంచు కోటను కూడా బద్దలు కొట్టగలిగింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అర్ధ సెంచరీతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో…
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక ములుపు చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం ఈ కేసులోని ఆరు నిందితుడికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. పోలీసులు ఈనెల 26న శ్రావణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలని తెలిపారు.
ఆర్సీబీ చేతిలో చెన్నై ఓటమికి సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలలో ఒకటి ఎంఎస్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ధోనీ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అభిమానులతో పాటు, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. దీని గురించి ఇర్ఫాన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. చెన్నైకి పూర్తి అనుకూలంగా ఉన్న పిట్లో 17 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ గెలవడం గమనార్హం. సీఎస్కే ఓటమి తర్వాత అభిమానులు చాలా…