జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈవో డా, జైతీర్థ్ ఆర్. జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్‌డీఎల్ డైరెక్టర్ జీ.ఏ. శ్రీనివాస మూర్తి, తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని సీఎం కోరారు. హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని రేవంత్ వివరించారు.
READ MORE: Israel Iran War: డేంజర్‌లో ఇజ్రాయిల్.. బలహీనంగా ఎయిర్ డిఫెన్స్.. మరో 10 రోజులకు మాత్రమే క్షిపణులు
ఇప్పటికే హైదరాబాద్ లో డిఫెన్స్ కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని చెప్పారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరణకు తెలంగాణ, హైదరాబాద్ ను ఎంచుకోవాలని, ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం వాదనలపై బ్రహ్మోస్ ఏరోస్పేస్ బృందం సానుకూలంగా స్పందించింది. ఈ భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
READ MORE: West Bengal: నార్త్ బెంగాల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా బంగ్లాదేశ్ చొరబాటు దారుడు..