కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం.. ఈ ఏడాది దొంగతనాలు పెరిగే అవకాశముందని, ప్రజా ప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు ప్రబలే సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను గమనిస్తే ఈ జ్యోతిష్య ఫలితాలు నిజమని…
బీజేపీ కార్యాలయంలో సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచానికి దిశా నిర్దేశనం చేసే శక్తి భారత దేశానికే ఉంది. ప్రతి మహిళలో తల్లిని చూడాలనే జ్ఞానం అందరిలో పెరుగుతుంది. ప్రభలమైన మార్పులు దేశంలో చోటు చేస్కోబోతున్నాయి. పాడి పంటలతో దేశం, ప్రతి గ్రామం పరిడవిల్లుతుంది. కాంతిని పూజించడంలో ఆనందించేవారు భారతీయులు. భారతదేశాన్ని రక్షించే రాజకీయ పక్షం బీజేపీ.
తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారు. పంచాంగ శ్రావణ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ భవన్ లో పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణం ప్రకారం.. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు కనిపిస్తాయి. సంపూర్ణ వర్షాలు పడతాయి. ప్రభుత్వం పాలన చేయడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. కేంద్రం నుండి వచ్చే సహకారం కూడా తీసుకునే అవకాశం ఉండదు. పత్తి పంటలకు మంచి అవకాశం. ఎర్ర నేలలో వేసే పంటకు మంచి అవకాశం. వస్త్ర పరిశ్రమలు కొత్తగా వెలుస్తాయి అభివృద్ధి బాగుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెజవాడలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కేసు విచారణలో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను విశ్లేషించిన పోలీసులకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదం జరిగిన రోజున ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్ సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. అదే సమయంలో అతని బుల్లెట్ బైక్ డూమ్ పగిలినట్టు గుర్తించారు.
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బాంరగడ్ తాలుక జూవి గ్రామానికి చెందిన పూసు పుంగంటి (52) అనే వ్యక్తిని మావోలు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం మేరకు, ఓ వివాహ వేడుకకు వెళ్లిన పూసు పుంగంటిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేశారు. అతను పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాంరగడ్…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్-1 పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ 550గా కమిషన్ నిర్ధారించింది. మహిళా అభ్యర్థి టాప్ వన్‌లో నిలిచింది. 52 మంది 500 కు పైగా మార్క్ లు సాధించారు.
అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఆమె భర్త అమిత్ లోయాను అదుపులోకి తీసుకున్నారు. పింకీ సంపాదించిన డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత జరిగిన ఆర్థిక నష్టాలే ఈ విషాదానికి కారణమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. పింకీ సంపాదించిన రూ. 7 లక్షలను అమిత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా, లాభంతో మొత్తం రూ. 20 లక్షలకు పెరిగింది. అయితే అత్యాశతో…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన వారు మౌనిక (26), మైథిలి (10), వినయ్ (7), అక్షర (9)గా గుర్తించారు. మృతదేహాల్లో మౌనికదే ఇంకా లభ్యం కాలేదు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న వేతన సవరణ (పీఆర్సీ) ప్రక్రియలో మరోసారి ఆలస్యం చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పీఆర్సీ కమిషన్ గడువు ఏప్రిల్ 2, 2024న ముగియనుండగా, కమిషన్ ఛైర్మన్ శివశంకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో కమిషన్ గడువును మరో 4 నుంచి 6 నెలల పాటు పొడిగించాలని సూచించారు.
మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. అయితే.. చాంద్రమాన క్యాలెండర్‌లోని చైత్రమాసపు మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చి చివరిలో…