మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. తాను హిందువు అని చెప్పుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి మతం, నిజస్వరూపం గురించి తెలుసుకుంది. ఈ విషయం బయటకు చెబితే.. ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు.
READ MORE: Off The Record: వరంగల్ లో డ్యూటీ చేయడానికి పోలీసులు హడలిపోతున్నారా?
ఈ కేసు జివాజిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం.. 2 నెలల క్రితం జివాజిగంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ అమ్మాయి మొబైల్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ ను కను పటేల్ అనే యువకుడు పంపాడు. అతను ఆ అమ్మాయి ఇంటి దగ్గరే నివసిస్తున్నాడు. ఆ అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ ను అంగీకరించింది. తర్వాత ఇద్దరూ ఛాటింగ్ చేసుకోవడం ప్రారంభించారు. కొన్ని రోజుల్లోనే కాను పటేల్ ఆ అమ్మాయి పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమె కూడా ప్రేమను అంగీకరించింది. ఇద్దరూ విష్ణు సాగర్ వద్ద కలుసుకోవాలని ప్లాన్ చేశారు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మోసం చేశాడు.
READ MORE: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇస్లాం స్వీకరించమని ఆమెపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి సంఘటన స్థలానికి పిలిపించింది. అక్కడ బజరంగ్ దళ్, ఇతర వ్యక్తులు ఆ యువకుడిని పట్టుకుని జివాజిగంజ్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అయితే.. ఆ యువకుడి అసలు పేరు నఫీస్ అని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తుర్కౌలియాలోని గుల్హరియా ఘాట్‌లో నివసించే సగిర్ ఖాన్ కుమారుడు అని తేలింది. అతను తన మతం, పేరును దాచిపెట్టి ఆమెను ప్రేమిస్తున్నట్లు నటించడంతో ఆ యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.