గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా యూపీ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటు అయ్యిందని, ఇప్పుడు అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ ఈడీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జిషీటు దాఖలును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు…
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్నలు సంధించింది. ముస్లింలను హిందూ మత ట్రస్టులలో చేరడానికి అనుమతిస్తారా ? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అనేక వక్ఫ్ ఆస్తులకు రిజిస్ట్రీ వంటి పత్రాలు లేనప్పుడు.. 'వక్ఫ్ బై యూజర్' చెల్లదని ఏ ప్రాతిపదికన ప్రకటిస్తారు? అని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్…
గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలోనికి వెళ్లారు. 2008 హర్యానా భూ ఒప్పందం, మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ విచారిస్తోంది. మంగళవారం దాదాపు ఐదు గంటల పాటు విచారించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PLMA) కింద ఆయన వాంగ్మూలాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం కూడా వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడారు. తాను బీజేపీ…
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో పది పిటిషన్లను ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారాడు. సినిమాల విషయాన్ని ప్రక్కన పెడితే యష్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద కోట్లు విలువ చేసే ఖరీదైన కార్లు ఉన్నాయట. ఇటీవల, ఆయన తన భార్య రాధికా పండిట్‌తో కలిసి ఓ విలాసవంతమైన కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్…
హీరో మోటోకార్ప్ తన ప్రముఖ మోటార్‌సైకిల్ ప్యాషన్ ప్లస్‌ను తాజాగా విడుదల చేసింది. ఇప్పుడు అప్డేట్ చేయబడిన హీరో ప్యాషన్ ప్లస్ బైక్ ఎన్నో అంచనాల మధ్య మార్కెట్లోకి ప్రవేశించింది. దాదాపు 4సంవత్సరాల తర్వాత హీరో ప్యాషన్ ప్లస్ బైక్‌ను మళ్లీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. దీని ధరను రూ.81,651 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలో కొత్త 2025 డియో 125 ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 96,749గా కంపెనీ ప్రకటించింది. యువతను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్‌ను సరికొత్తగా తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కొత్త డియో 125 అద్భుతమైన డిజైన్, సరికొత్త ఫీచర్లతో మెరుగైన సామర్థ్యం కలిగి ఉంది. ఈ కొత్త బండి స్పోర్టి, స్టైలిష్ మోటో-స్కూటర్‌గా ఆకర్షణీయంగా ఉంటుంది.
హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ స్కూటర్ TVS iQube, బజాజ్ చేతక్ వంటి ద్విచక్ర వాహనాల కంటే చౌకగా లభిస్తుంది. ధరలో మార్పు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త పోటీ తరంగాన్ని తెచ్చిపెట్టిందని నిపుణులు చెబుతున్నారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 లక్ష 40 వేల మంది విషపూరిత పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం సకాలంలో చికిత్స లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. కానీ కెన్యాలో కనుగొన్న ఒక ఆవిష్కరణ ఇప్పుడు పాము కాటుకు చికిత్సను సులభతరం చేసింది. ఇంట్లోనే తమ శరీరంలోని పాము విషాన్ని సులభంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీ కొని ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులను నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. పోలీసు వాహనంలో ఉన్న…