రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులపై సిట్ సోదాలు నిర్వహించింది. మద్యం స్కాంలో రాజ్ కసిరెడ్డి కోసం రేపు కూడా హైదరాబాద్లో సిట్ ఉండనుంది. ఇవాళ మూడు చోట్ల గాలించినా కసిరెడ్డి ఆచూకీ లభించలేదు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కసిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్టు సమాచారం అందటంతో సిట్ అక్కడకి వెళ్లినా ఫలితం లభించలేదు. కసిరెడ్డి భాగ్యనగరంలోనే ఉన్నారని పక్కా సమాచారం అందటంతో మరో 2 రోజులు గాలింపు చర్యలు చేపట్టాలని సిట్ నిర్ణయం తీసుకుంది. తనిఖీల నేపథ్యంలో సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు…
ప్రభుత్వం జిల్లాలో కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తోంది. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న కృష్ణా లంక భూములను మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా, జిల్లా కలెక్టర్ లక్షిషా, ఇతర అధికారులు పరిశీలించారు. కృష్ణా నదిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోనీ పెద లంక, చిన లంకలో ఉన్న లంకభూములు పరిశీలించారు. మూడు కిలోమీటర్లు లంక భూముల్లో కాలినడకన తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు…
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా.. ఈ…
అల్లూరి జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయితీ డప్పుగుడ గ్రామంలో గడబంటు భీమన్న(46) హత్యకు గురయ్యాడు. హత్య చేసిన చిట్టపురి పొల్లు అనే వ్యక్తి హత్యకు వాడిన కత్తితో సహా అరకులోయ పోలీస్ స్టేషన్లో వెళ్లి లొంగిపోయాడు. హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని డిఎస్పీ షేక్ సహాబాజ్ అహమద్ తెలిపారు. ఓ వైపు హత్యకు ఆర్థిక వ్యవహారాలే కారణమని చెబుతుండగా.. గ్రామస్థులు, బంధువులు మాత్రం హత్యకు చేతబడే కారణమని చెపుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రేపటి నుండి క్యాన్సర్ కేసుల అంశంపై మరోసారి సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. క్యాన్సర్ కేసులు విషయంలో అధికారుల లెక్క, వాస్తవ పరిస్థితులకు భిన్నమైన వాదన ఉన్న నేపథ్యంలో గ్రామంలో మరోసారి సమగ్ర సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి రొమ్ము, గర్భాశయ, ముఖద్వారం, ఓరల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో జిల్లా వైద్యాధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
దళితుల కోసం యుద్ధం చేసిన యోధుడు అంబేద్కర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రోజు మన అందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ అన్నారు.. 2003లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశామని.. చదువుకోవాలనే ఆశ ఉండే పిల్లలందరినీ చదివిస్తామని హామీ ఇచ్చారు. తొందర్లోనే మంచి స్కీంను తీసుకొస్తామని తెలిపారు. అమరావతికి దేశంలోని మంచి కాలేజీలు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 21…
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండలంలో నాలుగు గుళ్ల పైన అన్యమత సూక్తులు, గుర్తులు రాశారని.. టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలును ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు పగోటి ఈశ్వరరావు (బుడితి గ్రామం), మామిడి అజయ్ (కాకినాడ జిల్లా), చందక దేవుడు నాయుడు (బుడితి గ్రామం) అని తెలిపారు. చందక దేవుడు బుడితిలో పాస్టర్…
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. 24 గంటలలో డెలివరీ కావలసిన భార్యను గొంతు నులిమి చంపేశాడు భర్త. మనస్పర్థలు కారణంగా భార్య అనూషకు భర్త జ్ఞానేశ్వర్ మధ్య గొడవ తలెత్తింది. రెండు ఏళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంతలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా.. ఈ అంశంపై తాజాగా ఆమె స్నేహితుడు కీలక విషయాలు వెల్లడించారు. రెండేళ్ల క్రితం సింహాచలంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చెప్పారు. మృతురాలు అనూష తండ్రి చనిపోయారు, తల్లికి ఆరోగ్యం బాగోలేక మూడేళ్లగా కోమాలో ఉందన్నారు.
చిత్తూరులో వివాహిత అనుమానాస్పద మృతి చోటు చేసుకుంది. పరువు హత్య కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. చిత్తూరుకు చెందిన యాస్మిన్ భాను 3 నెలల క్రితం పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజను ప్రేమ పెళ్లి చేసుకుంది. యాస్మిన్ భాను, సాయితేజ్ గత ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అదే నెల 13న తిరుపతి రూరల్ పోలీసులను ప్రేమజంట ఆశ్రయించింది. ఇద్దరూ మేజర్లు కావడంతో యాస్మిన్ భాను తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. యువతిని సాయితేజ వెంట పంపించారు.