ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.”నాకు ముగ్గురు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంతకం చేశారు. నామినేషన్ వేయడానికి వస్తే వేయ నివ్వలేదు. కౌన్సిల్ మెంబెర్స్ ను ఫోన్ చేసి భయపెట్టించారు. పార్టీకి రాజీనామా లేఖను ఇచ్చాను.. స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని కిషన్ రెడ్డికి చెప్పాను. పార్టీ కోసం సర్వం ధార పోశాను. టెర్రరిస్టు లకు టార్గెట్ గా ఉన్నాను. మీకో దండం, మీ పార్టీకో దండం. పార్టీకి లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్న. వాళ్ళు అనుకున్న వాళ్ళకే అధ్యక్ష పదవి ఇచ్చుకున్నారు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Rajasthan: “ఖాకీల దౌర్జన్యం”.. పోలీసు దెబ్బకు స్పృహ కోల్పోయిన దుకాణదారుడు..(వీడియో)
లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇదని ఎమ్మె్ల్యే రాజాసింగ్ అన్నారు. ఆత్మీయతను కలిగించే పార్టీ నేతల్ని పక్కన పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. పలువురు నేతలు వ్యక్తిగత ప్రయోజనాలతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఈ నిర్ణయం కార్యకర్తల్లో మోసం చేసిన భావన కలిగిస్తోందన్నారు. కొన్ని వర్గాలు కేంద్ర నాయకత్వాన్ని తప్పుదోవ పట్టించాయని.. బీజేపీలో ఇక కొనసాగలేనని స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు.పార్టీకి రాజీనామా చేశాను కానీ హిందుత్వం కోసం పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్‌లను నిర్ణయంపై పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సిద్ధంగా ఉందని.. కానీ నాయకత్వం సరైనది కావాలన్నారు.