Rajasthan: “ఖాకీల దౌర్జన్యం”.. పోలీసు దెబ్బకు స్పృహ కోల్పోయిన దుకాణదారుడు..(వీడియో)
- పోలీసుల దౌర్జన్యం పెరుగుతోంది
- రాజస్థాన్ నుంచి ఓ వీడియో విడుదల
- పోలీసు ఓ వ్యక్తిని గట్టిగా కొట్టాడు
- దీంతో ఆ వ్యక్తి స్పృహ కోల్పోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసుల దౌర్జన్యం పెరుగుతోంది. తాజాగా ఓ పోలీసు అధికారి రోడ్డు మధ్యలో ఓ దుకాణదారుడిని చెంపదెబ్బ కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పోలీసుల క్రూరత్వానికి ఈ వీడియో ఓ ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.
READ MORE: Venky Atluri: అందుకే లక్కీ భాస్కర్ ఆయనతో చేశా
Also Read
ఆ వీడియో ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని కైతునిపోల్ ప్రాంతంలో తన దుకాణం ముందు పార్క్ చేసిన బైక్‌ను తీసివేయమని ఎస్‌హెచ్‌ఓ దుకాణదారుడిని కోరినట్లు చెబుతున్నారు. ఆ దుకాణదారుడు అది తన బైక్ కాదని, దానికి లాక్ వేసి ఉందని సమాధానమిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన ఎస్‌హెచ్‌ఓ పుష్పేంద్ర బన్సివాల్ సహనం కోల్పోయాడు. ఇతర పోలీసులతో కలిసి దుకాణదారుడిపై దారుణంగా దాడి చేశాడు. అనంతరం ఆ దుకాణ దారుడిని పోలీసు వాహనంలో ఎక్కించేందుకు యత్నించాడు. తాను ఎక్కనని.. తాను చేసిన తప్పేంటో చెప్పాలని అతడు వాగ్వాదానికి దిగడంతో పుష్పేంద్ర గట్టిగా అతడి చెంపపై కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కుప్పకూలాడు. పోలీసుల దౌర్జన్యాన్ని ప్రస్తావిస్తూ.. NCMIndia కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. “ఈ ఖాకీ గూండాల నుండి మనం ఇంకా ఏమి ఆశించగలం?” అని ప్రశ్నించింది. ఈ సంఘటన మే 29న జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ ఎన్జీఓ ప్రశ్నించింది.
READ MORE: Venky Atluri: దిల్ రాజు దగ్గర పనిచేసిన అనుభవం బాగా ఉపయోగపడింది!
Meet SHO Pushpendra Bansiwal of @KotaPolice who slapped a shopkeeper so hard that he instantly fainted and became unconscious.
It was alleged that the SHO asked the shopkeeper to remove a bike parked in front of his shop in the Kaithunipol area of Kota in Rajasthan. The… pic.twitter.com/WHC4mWeXev— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) June 29, 2025
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!