ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు సమీపంలో అకస్మాత్తుగా ఇంజన్ లో సమస్య ఏర్పడింది.. పైలట్ సకాలంలో ఇంజన్ సమస్యను గుర్తించి సేఫ్ ల్యాండింగ్ కోసం తిరిగి చెన్నైకి రిటన్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఎసీటీ అధికారులతో సంప్రదించి సేఫ్ ల్యాండింగ్ కోసం పైలెట్ ప్రయత్నించారు. ఇండిగో విమానం సేఫ్ ల్యాండింగ్ కోసం చెన్నై ఎయిర్ పోర్ట్ లో అన్ని ఏర్పాట్లు చేశారు.
READ MORE:Air India flight: టోక్యో-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో సమస్య.. కోల్‌కతాలో ల్యాండింగ్..
సేఫ్ గా విమానం ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 159 మంది ప్రయాణికులు, 6 మంది విమాన సహాయకులు, 165 మంది సెఫ్ గా బయటపడ్డారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయ విమానంలో ప్రయాణికులను పంపడానికి ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3.40 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు ఐదు గంటలకు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో ఘటన చోటు చేసుకుంది.
READ MORE: Operation Sindoor: “భారత్ కొన్ని విమానాలు కోల్పోయింది”.. రక్షణ అధికారి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..