యువత మత్తుకు బానిసవుతోంది. లిక్కర్ తర్వాత .. గంజాయి, డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ డ్రగ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. పబ్స్ మాటున యువతకు నిత్యం డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. మాదక ద్రవ్యాలు యువతను మత్తులో ముంచేస్తున్నాయి. బంగారం లాంటి భవిష్యత్తును ఛిద్రం చేస్తున్నాయి. వీటికి అవుననే సమాధానాలు వస్తున్నాయి. సిటీలో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గలీజ్ దందాకు పబ్స్ కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఇది హైదరాబాద్‌లో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. గంజాయి లాంటి చీప్ డ్రగ్స్‌తోపాటు ఇంటర్నేషనల్ స్థాయిలో ఖరీదైన మత్తు పదార్థాలు కొకైన్ లాంటివి అన్నీ పబ్‌లలోనే దొరుకుతున్నాయి..
READ MORE: Mahavatar Narasimha Trailer: ట్రైలర్ రిలీజ్.. నరసింహుడి ఉగ్రరూపం చూస్తే గూస్‌బంప్స్ పక్కా..!
పబ్స్ పార్టీల్లో మాత్రమే కాకుండా.. ఫామ్ హౌజ్ పార్టీలు, ముజ్రా పార్టీల్లోనూ డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ పార్టీల్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న నిర్వాహకులు దొరికితే దొంగ లేకుంటే దందా అన్న రీతిలో వ్యాపారం సాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక పబ్స్‌లో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు ఈగల్ అని కొత్త పేరు పెట్టిన తర్వాత దాడులు ముమ్మరమయ్యాయి. తాజాగా రంగంలోకి దిగిన ఈగల్ టీమ్.. పబ్స్ మాటున డ్రగ్స్ దందా చేస్తున్న అతిపెద్ద రాకెట్‌ను పట్టుకుంది.. ఈ డ్రగ్ రాకెట్‌లో కొంపల్లిలో ఉన్న మల్నాడు కిచెన్ యజమాని సూర్య కింగ్‌పిన్‌గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ఏకంగా హైదరాబాద్ 3 పబ్స్ యజమానులతో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుని డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు బయటపడింది. అంతే కాదు హైదరాబాద్ సమీపంలో ఉన్న ఓ రిసార్టులో కూడా డ్రగ్స్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. అంతే కాదు సూర్య అనే వ్యక్తి ఏర్పాటు చేసిన పార్టీల్లో 23 మంది పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. కొంపల్లి కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్ దందాలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. ఢిల్లీకి నుంచి ఇద్దరు నైజీరియన్లు ఈ డ్రగ్‌ను హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లుగా గుర్తించారు. ఐతే సూర్యకు డ్రగ్స్ డెలివరీ చేసే క్రమంలో నైజీరియన్స్ చాలా తెలివిగా వ్యవహరించారు. మహిళల చెప్పుల్లోని హైహీల్స్‌లో పెట్టి నేరుగా సూర్యకు పంపిస్తున్నారు. వాటిని పబ్బుల్లో పార్టీలకు అందిస్తున్నాడు సూర్య. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న రిసార్టుల్లోనూ డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ సమీపంలో ఉన్న రిసార్టులను ఎంగేజ్ చేసుకుని ఈ డ్రగ్ పార్టీలు ఏర్పాటు చేసినట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది..
READ MORE: Pawan Kalyan: జనసేనలోకి వైసీపీ జెడ్పీటీసీలు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్!
ఇక సూర్యకు చెందిన మల్నాడు రెస్టారెంట్ తెలంగాణ రుచులకు చాలా ఫేమస్. MBA పూర్తి చేసిన సూర్య మొదట చిన్నగా ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం కొంపల్లిలోని 5 అంతస్తుల భవనంలో మల్నాడు రెస్టారెంట్ నడుస్తోంది. బెంగళూరులోనే MBA చదివే సమయంలో సూర్యకి డ్రగ్ అలవాటయింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖులతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. మరోవైపు ప్రతినిత్యం మల్నాడు రెస్టారెంట్‌కు ప్రముఖులు వస్తుండడంతో వారితో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్తా కలిసి డ్రగ్స్ తీసుకునే వరకు వెళ్లి పోయింది. ఇది అక్కడ వరకే పరిమితం చేస్తే బాగుండేది. సూర్యకి ఢిల్లీలో ఉన్న నిక్కి, జెర్రీ అనే ఇద్దరు నైజీరియన్లతో గతం నుంచే పరిచయం ఉంది. ఇద్దరు కూడా హైదరాబాద్, బెంగళూర్ ఢిల్లీకి డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. ఈ ఇద్దరు నైజీరియన్ల ద్వారా డ్రగ్స్‌ను హైదరాబాద్ తెప్పించి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నాడు సూర్య. కానీ అతను ఎప్పుడు కూడా నేరుగా వెళ్లి తీసుకురాలేదు. ప్రతిసారి కూడా పార్సిల్స్ రూపంలో తెప్పించుకునేవాడు. పలుమార్లు తినే ఆహార పదార్థాల రూపంలో డ్రగ్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో వివిధ వస్తువుల రూపంలో మాదకద్రవ్యాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఈసారి మహిళల హైహీల్స్ చెప్పుల్లో పెట్టి డ్రగ్స్ వస్తున్నట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు అధికారులు సూర్య పై నిఘా పెట్టారు. సూర్యకి డ్రగ్ పార్సెల్ వచ్చిన వెంటనే అధికారులు రైడ్ చేశారు. అతన్ని విచారించినప్పుడు హైదరాబాద్ నగరంలోని ప్రముఖులు కూడా డ్రగ్స్ తీసుకుంటున్న తేనెతుట్టె కదిలింది. హైదరాబాద్‌లో హోటల్స్, పబ్బులు, రెస్టారెంట్లు నిర్వహిస్తున్న వాళ్ల జాబితా సూర్య సెల్‌ఫోన్ నుంచి బయటకు వచ్చింది. అంతేకాకుండా వీళ్లంతా కూడా డబ్బులను గూగుల్ పేతో ఇతర ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేల ద్వారా సూర్యకు పంపినట్లు తేలింది.